రంగారెడ్డిలో మారుతున్న రాజకీయం.. కారుకు ఈ సారి షాకే?

-

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా…ఆంధ్రా ప్రజల ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లా. ఈ జిల్లాలో ఊన్న మెజారిటీ నియోజకవర్గాల్లో గెలుపోటములని ఆంధ్రా నుంచి వచ్చి సెటిల్ అయిన ఓటర్లే డిసైడ్ చేస్తారు. వారు మద్ధతు దొరికితే చాలు…ఇక్కడ మెజారిటీ సీట్లు దక్కించుకోవచ్చు. అయితే గత రెండు ఎన్నికల్లో జిల్లాలో పరిస్తితిని గమనిస్తే…2014లో జిల్లాలో టీడీపీ హవా నడిచింది. మెజారిటీ సీట్లు ఆ పార్టీనే కైవడం చేసుకుంది. ఆంధ్రా జనం పూర్తిగా టీడీపీ వైపు నిలవడంతో…ఆ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. అప్పుడు టీడీపీ-బీజేపీలు పొత్తులో కలిపి మెజారిటీ సీట్లు దక్కించుకున్నాయి.

TRS-Party | టీఆర్ఎస్
TRS-Party | టీఆర్ఎస్

జిల్లాలో 14 సీట్లు ఉంటే…టీడీపీ 7 సీట్లు బీజేపీ ఒకటి గెలుచుకుంది. అంటే మెజారిటీ సీట్లు టీడీపీవే. 2018 ఎన్నికలోచ్చేసరికి తెలంగాణలో టీడీపీ పరిస్తితి దారుణంగా తయారైన విషయం తెలిసిందే. పైగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడంతో…ఆంధ్రా ప్రజలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. జిల్లాలో 11 సీట్లు టీఆర్ఎస్ గెలుచుకోగా, మూడు సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ నుంచి గెలిచిన ముగ్గురు….టీఆర్ఎస్‌లోకి వెళ్ళిపోయారు. దీంతో జిల్లా మొత్తం టీఆర్ఎస్ చేతుల్లో ఉంది.

అయితే ఇప్పుడుప్పుడే రంగారెడ్డిలో రాజకీయం మారుతూ వస్తుంది. ఏదో రెండుసార్లు సెంటిమెంట్‌తో టీఆర్ఎస్ గట్టెక్కుతూ వచ్చింది గానీ..ఈ సారి మాత్రం రంగారెడ్డి ప్రజలు…కారుకు షాక్ ఇచ్చేలా ఉన్నారు. ఎందుకంటే అంతా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే…కానీ ప్రజలకు అండగా ఉంటే ఎమ్మెల్యేలు తక్కువ. దీంతో పలువురు ఎమ్మెల్యేలపై నెగిటివ్ పెరుగుతుంది. రెండు, మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కువే కనిపిస్తోంది.

ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీలు సైతం నిదానంగా పుంజుకుంటున్నాయి. అంటే ఈ సారి రంగారెడ్డిలో ట్రైయాంగిల్ ఫైట్ జరిగేలా ఉంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. నెక్స్ట్ ఏపీలో గానీ టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటే…ఇక్కడ జనం కాస్త బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఏది ఎలా మారినా సరే…ఈ సారి కారుకు మాత్రం జనాలు షాక్ ఇచ్చేలా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news