ఆరోగ్య సేతు యాప్ గురించి మాట్లాడిన డబ్ల్యూహెచ్వో చీఫ్

-

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ను తగ్గించే నేపథ్యంలో భాగంగా మన భారత దేశం చాలా రకాల ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే కరోనా మహమ్మారి వ్యాధి పై నిఘా పెట్టేందుకు గాను మన భారత ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్ ను కనుగొన్నారు. అయితే ఈ ఆరోగ్య సేతు యాప్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ అయిన టెడ్రోస్ అధానామ్ ప్రస్తావించారు. మన భారత దేశంలో ఇప్పటివరకు ఆరోగ్య సేతు యాప్ ను ఇప్పటి వరకు 15 కోట్లమంది డౌన్లోడ్ చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.

కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని గుర్తించడంలో ఈ యాప్ ఎంతో ఉపయోగపడింది అని అయన తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మన ప్రభుత్వాలు అమలుచేస్తున్న డిజిటల్ టెక్నాలజీ వ్యూహాలు బాగా ప్రభావశీలంగా పని చేసాయి అని తెలిపారు. అయితే కరోనా వైరస్ ను నియంత్రించేందుకు హెర్డ్ ఇమ్మ్యూనిటి వ్యూహన్ని ఎంచుకోవడంలో చాలా రకాల ప్రశ్నలు వస్తాయి అని, అందుకే దీనిని ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాలని అయన తెలిపారు. !!

Read more RELATED
Recommended to you

Latest news