భార్యభర్తల మధ్య అనురాగాలు, అనుబంధాలు క్రమంగా తుడిచిపెట్టుకుపోతున్నాయి. కొందరు తమ స్వార్థం కోసం తన భర్తలను అడ్డు తొలగించుకుని మరీ ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుంటున్నారు. ఇటువంటి ఘటనలు సమాజంలో అనేక వెలుగుచూస్తున్నాయి.
తాజాగా మరో మహిళ తన భర్తను హత్యచేసి అతని ఆనవాళ్లు లేకుండా చేసింది. తన భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేయడంతో పాటు కాల్చి బూడిద చేసింది. ఈ ఘటన గ్రేటర్ నగరంలోని కూకట్‌పల్లి సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. భర్త అనారోగ్య సమస్యే అతని హత్యకు కారణం అయినట్లు సమాచారం.తన సోదరులతో కలిసి భర్త సాయిలును భార్య చంపినట్లు తెలుస్తోంది. గత 15 ఏళ్లుగా సాయిలు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది. విషయం బయటకు రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు KPHB పోలీసులు తెలిపారు.
కూకట్పల్లిలో భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి చంపిన భార్య
అనంతరం మృతదేహాన్ని పూడ్చిపెట్టిన భార్య కవిత.
తన సోదరులతో కలిసి భర్త సాయిలును చంపిన భార్య.
భర్త అనారోగ్య సమస్యే హత్యకు కారణం అయినట్లు సమాచారం.
గత 15 ఏళ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సాయిలు.
కేసు నమోదు చేసిన KPHB… pic.twitter.com/FVmOjSySX5— ChotaNews App (@ChotaNewsApp) April 21, 2025