‘వడాపావ్’కు ప్రపంచ గుర్తింపు…. ఎన్నో స్థానంలో నిలిచిందంటే…?

-

‘వడాపావ్’ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండియాలో స్ట్రీట్ ఫుడ్స్ లోనే ఇది చాలా ఫేమస్. ముంబైలోనే ఎక్కువ గుర్తింపు పొందిన ఈ స్నాక్ క్రమక్రమంగా దేశం వ్యాప్తంగా విస్తరించింది. ఇక మహారాష్ట్ర ప్రజల ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ వడాపావ్ ప్రపంచ గుర్తింపు పొందింది. ఈ ఫుడ్ ‘ప్రపంచంలోని టాప్-50 బెస్ట్ శాండ్విచ్’ల లిస్టులో స్థానం దక్కించుకుంది.ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ అయిన ‘టేస్ట్ అట్లాస్’ ప్రకారం… వరల్డ్ లోనే బెస్ట్ శాండ్విచ్లో వడాపావ్ 19వ ప్లేసులో గెలిచింది.

ఈ స్ట్రీట్ ఫుడ్ ముందుగా ముంబై దాదార్ రైల్వే స్టేషన్‌లో అశోక్ వైద్య అనే వీధి వ్యాపారి నుంచి ఉద్భవించింది. ఆకలితో ఉన్న పేద కార్మికులకు తక్కువ ధరలో ఎక్కువ శక్తినిచ్చే వంటకంగా ఈ వడ పావ్ ని తయారు చేశారు. ఇలా తక్కువ కాలంలోనే ముంబై వ్యాప్తంగా వడపావ్ విస్తరించింది ప్రస్తుతం దేశంతో పాటు కాకుండా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news