ఇప్పటి వరకు ప్రపంచలోనే అతి పెద్ద విమానం గా ఏఎన్ 225 ఉండేది. ఈ ఏఎన్ – 225 మ్రియా ఉక్రెయిన్ లోనే ఉండేది. అయితే ప్రస్తుతం ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. కాగ ఈ యుద్దంలో ప్రపంచంలోనే అతి పెద్ద విమానం అయిన ఏఎన్ – 225 మ్రియా ధ్వంసం అయింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ప్రకటించారు. రష్యా బలగాల దాడిలో ఏఎన్ – 225 ధ్వంసం అయిందని ఆయన అన్నారు. అది మళ్లీ పునర్ నిర్మించడానికి వీలు ఉంటుందో లేదో తెలియదని అన్నారు.
కాగ రష్యా బలగాలు.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని ఆక్రమించుకోవడమే లక్ష్యం గా దాడులు చేస్తున్నారు. ఆ క్రమంలో కీవ్ నగరంలో ఉన్న హోస్టోమెల్ ఎయిర్ పోర్ట్ పై బాంబులతో రష్యా బలగాలు దాడులు చేశారు. దీంతో ఆ విమానాశ్రయంలో ఉన్న ప్రపంచంలో అతి పెద్ద విమానం ఏఎన్ – 225 మ్రియా ధ్వంసం అయింది. కాగ ఈ ఏఎన్ – 225 మ్రియా ను ఉక్రెయిన్ కు చెందిన ఎరోనాటిక్స్ సంస్థ ఆంటోనోస్ తయారు చేసింది. దీని రెక్కలు 84 మీటర్ల పొడువు ఉంటాయి. కాగ ఈ ఏఎన్ – 225 మ్రియాను తప్పక పునర్ నిర్మిస్తామని ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది.