వైరల్: ఎద్దు ఎదుట రీల్స్ చేసిన యువతి.. ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!

-

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో రీల్స్ చాలా ఫేమస్ అయ్యాయి. సోషల్ మీడియా స్టార్స్ తమ రోజువారీ జీవన విధానంలో దానిని ఒక పార్ట్ గా చేసుకున్నారు. వీవర్స్, ఫ్యాన్స్ కోసం కొత్త కొత్త ఐడియాలజీతో రీల్స్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో పోస్ట్ చేస్తుంటారు. అలా వాళ్లు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలొయింగ్‌ను పెంచుకుంటున్నారు. తాజాగా అలాంటి ఒక వీడియోనే ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.

యువతి-రీల్స్-ఎద్దు
యువతి-రీల్స్-ఎద్దు

‘భూత్ని కే మిమ్స్’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఆ వీడియో అప్లోడ్ అయింది. ఈ వీడియోలో ఓ యువతి ఎద్దు దగ్గరికి వెళ్లి రీల్స్ చేయాలని అనుకుంటుంది. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ అన్ని సెట్ చేసుకుని రీల్స్ చేయడానికి సిద్ధమవుతుంది. కొన్ని సెకన్ల వరకు యువతి డ్యాన్స్ చేస్తుండగా.. ఇంతలో ఎద్దు ఆ యువతిని చూసి.. పొడవడానికి వెళ్తుంది. దీంతో భయపడిన ఆ యువతి అక్కడి నుంచి పారిపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అయింది. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు.. అక్క భయపడిందంటూ కామెంట్లు చేస్తున్నారు. పలువురు చాలా ఫన్నీగా ఉందంటూ నవ్వుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news