రాఖీ పండుగ వేళ.. అన్నకు ప్రాణదానం చేసిన చెల్లెలు

-

రక్షా బంధన్‌ వేళ.. ఓ చెల్లి అన్నకు ప్రాణదానం చేసి.. అతడి కుటుంబాన్ని కాపాడింది ఓ చెల్లి. ఈ అరుదైన సంఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. రామ్‌గఢ్‌కు చెందిన ఓ సోదరి తన అన్నకు కిడ్నీ దానం చేసి.. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ఆదర్శంగా నిలిచింది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న వీరిద్దరూ.. అక్కడే రాఖీ పండుగ జరుపుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్లితే..  రామ్‌గఢ్‌కు చెందిన దేవేంద్ర బుడానియా అనే వ్యక్తి సుమారు ఎనిమిదేళ్లుగా అనగా 2016 నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో అతడికి దూరపు బంధువు ఒకరు కిడ్నీ దానం చేశాడు. దాంతో అతడు ఇన్నేళ్లు ఆరోగ్యంగానే ఉన్నాడు. సుమారు ఎనిమిదేళ్ల తర్వాత అనగా ఈ ఏడాది కిడ్నీ పని చేయడం మానేసింది.

దీంతో.. మరోసారి దేవేంద్రకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ చికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కిడ్నీ దాత కోసం వెతకడం ప్రారంభించారు. ఈ తరుణంలో దేవేంద్ర సోదరి సునీతకు ఈ విషయం తెలిసింది. ఇక తానే తన అన్నకు కిడ్నీ దానం చేయాలని భావించింది. వెంటనే ఈ విషయాన్ని తన అత్తారింట్లో, పుట్టింట్లో చెప్పి.. వారిని ఒప్పించి.. అన్న దేవేంద్రకు కిడ్నీ దానం చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ అహ్మదాబాద్‌లోని సివిల్‌ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version