రేపట నుంచి తెలంగాణలో థియేటర్లు ఓపెన్ !

కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా తెలంగాణలో థియేటర్లు మూత పడిన సంగతి తెలిసిందే. దీంతో చాలా సినిమాలు తమ రిలీజ్‌ డేట్స్‌ ను వాయిదా వేసుకున్నాయి. ఇక ఇటు కరోనా సెకండ్‌ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఇక ఎలాగైనా.. థియేటర్స్‌ ఓపెన్‌ చేయాలని యోచనలో యాజమాన్యాలు ఆలోచన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ ను తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌, థియేటర్ల యాజమాన్యంకు చెందిన ప్రతినిధులు కలిశారు.

ఈ సందర్భంగా తమ సమస్యలను మంత్రి తలసాని వద్దకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే… ఆదివారం నుంచి తమ సినిమా హళ్ళనున తెరుస్తామని మంత్రికి థియేటర్ల యాజమాన్యం తెలిపింది. అయితే.. వారి సమస్యలపై మంత్రి తలసాని కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.

దీంతో అందుబాటులో ఉన్న సినిమాలతో తొలుత ప్రదర్శన మొదలు పెట్టడానికి ఎగ్జిబిటర్ల్స్‌ సిద్ధమవుతున్నారు. నిర్మాతలు కూడా కొత్త సినిమాను రిలీజ్‌ చేయడం మొదలు పెడితే… మళ్లీ థియేటర్లు కళకళలాడటం ఖాయంగా కనిపిస్తోంది.