తిరుపతిలో గోవిందరాజ స్వామి ఆలయంలో కలకలం.. రాత్రంతా గుడిలోనే దొంగ ?

Join Our Community
follow manalokam on social media

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో చోరీ యత్నం జరిగింది. తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయాన్ని సీసీఎస్ పోలీసులు పరిశీలించారు. ఆలయంలో చోరీ యత్నం జరిగిన ప్రాంతాన్ని సీసీఎస్ డీఎస్పీ మురళీధర్ కూడా పరిశీలించారు. విష్ణు నివాసం లో కమాండ్ కంట్రోల్ యూనిట్ లో సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి సీసీటీవీ విజువల్స్ పరిశీలించారు. 

ఈ అంశం మీద క్రైం డిఎస్పి మురళీధర్ మాట్లాడుతూ సీసీ టీవీ ఫుటేజ్ లో దొంగను గుర్తించామని, ఎటువంటి వస్తువులు చోరీ కాలేదని అన్నారు. రాత్రంతా వ్యక్తి లోపలే ఉన్నాడన్న ఆయన ధ్వజ స్తంభం వద్ద దొంగతనానికి యత్నించాడని అన్నారు. తాళాలు తెరిచేందుకు యత్నించినా సాధ్య పడలేదని, ఉదయం భక్తులతో కలిసి బయటకు వెళ్లిపోయినట్లు భావిస్తున్నామని అన్నారు. దొంగ వయసు 20-25 సంవత్సరాలు గా ఉంటుందని భావిస్తున్నామని, పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకుంటామని అన్నారు. 

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...