హన్మకొండలో భారీ చోరీ.. కారు అద్దాలు పగలగొట్టీ మరీ…

నేరగాళ్లకు చిన్న అవకాశం దొరికినా సరే..రెచ్చిపోతున్నారు. ఆదమరిచి ఉంటే తమ సొమ్ముకు గ్యారెంటీ లేకుండా పోతోంది. చిన్న ఆజాగ్రత్తకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే హన్మకొండలో జరిగింది. కొద్ది పాటి నిర్తిప్తత భారీ చోరికి మూలం అయింది. హన్మకొండ జిల్లా కేంద్రంలోని నక్కలగుట్ట హెచ్.డి.ఎఫ్.సి. భ్యాంకు దగ్గర ఘరానా చోరీ జరిగింది. బ్యాంకులో డ్రా చేసిన రూ. 25 లక్షలను కారులో పెడితే కొట్టేశారు దొంగలు. కారు అద్దాలు పగలగొట్టీ మరీ.. దొంగతనం చేశారు. హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు నుంచి పైసలను డ్రా చేసిన స్థిరాస్తి వ్యాపారి తిరుప‌తి వాటిని తన కారులో పెట్టి.. సంతకం నిమిత్తం తిరగి బ్యాంకులోకి వెళ్లి వచ్చాడు. ఈలోపు గుర్తు తెలియని దుండగులు కారు అద్దాలు పగులగొట్టి నగదును అపహరించారు.

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బ్యాంకు ప‌రిస‌రాల్లోని సీసీ కెమెరాల‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా తిరుపతిని దగ్గరగా గమమనించిన వ్యక్తులే  ఈ చోరీకి పాల్పడే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.