దేశ వ్యాప్తంగా సూపర్ హిట్ అయిన ‘ ది కాశ్మీర్ ఫైల్స్’ ఇక ఓటీటీలో సందడి చేయబోతోంది. తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.330 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 1990లో కాశ్మీర్ లో జరిగిన పండిట్ల ఊచకోత ప్రధానాంశంగా రూపొందిన ‘ ది కాశ్మీర్ ఫైల్స్’ ప్రధాని మోదీ ప్రశంసలు కూడా పొందింది.
గుజరాత్, మధ్యప్రదేశ్, అస్సాం వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు సినిమాకు టాక్స్ ఫ్రీ ప్రకటించాయి. సినిమా ఎంత హిట్ అయిందో… అంతే స్థాయిలో వివాదాలు చుట్టుముట్టాయి. బీజేపేతర పార్టీలు ఈ సినిమాను వ్యతిరేఖించారు. వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ‘ ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా ఓటీటీలో రిలీజ్ రానుంది. మే 13 వ తేదీన ” ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇక దీంతో ఈ మూవీని చూసేందుకు.. ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు.