అప్పుడే కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్థిపై రేవంత్‌రెడ్డి క్లారిటీ..!

-

రేవంత్‌రెడ్డి revanth reddy ఎప్పుడైతే టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యారో అప్ప‌టి నుంచే తెలంగాణ రాజ‌కీయాల్లో త‌న మార్కు క‌నిపించేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్ప‌టికే ఎన్నో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్న రేవంత్ తాజాగా మ‌రోసారి అలాంటి వ్యాఖ్య‌లే చేశారు. అప్పుడే కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తానంటూ శ‌ప‌థాలు చేస్తున్నారు. అంతే కాదు త‌న‌పై వ‌స్తున్న అసంతృప్తులను కూడా వివ‌రిస్తున్నారు.

రేవంత్‌రెడ్డి/ revanth reddy

2023 త‌ర్వాత కేసీఆర్ పాలన మారుతుంద‌ని తామే అధికారంలోకి వ‌స్తామంటూ రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అయితే ప్ర‌స్తుతం టీఆర్ ఎస్‌కు ప్ర‌తిప‌క్షం బీజేపీ కాద‌ని, తామే ప్ర‌తిప‌క్ష‌మ‌ని తేల్చి చెబుతున్నారు రేవంత్‌. ఇక త‌న‌పై ఫైర్ అవుతున్న సీనియ‌ర్ల అసమ్మతి టీ కప్పులో తుఫాన్ లాంటిదని, తామంతా ఒక‌టే అంటూ వివ‌రిస్తున్నారు.

అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ను ఎలాగైనా అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాను ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం వెల్తున్నానని, ఇక పార్టీలో ఎవ‌రు ఏ స్థానంలో ఉండాలో అధినేత్రి సోనియాగాంధీయే చెబుతార‌ని వివ‌రించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సీఎం అభ్య‌ర్థిని మాత్రం సోనియా గాంధీ నియ‌మిస్తార‌ని తెలిపారు. కాక‌పోతే రేవంత్ వ్యాఖ్య‌లు చూస్తుంటే చేసిందేమీ లేదు గానీ మాట‌లు కోట‌లు దాటుతున్నాయంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version