Ap: ఈ ఏడాది 83 రోజులు సెలవులు.. దసరా, సంక్రాంతి హాలిడేస్ ఎప్పుడంటే?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు కూటమీ ప్రభుత్వం. ఈ ఏడాది ఏపీలోని విద్యాసంస్థలకు 83 రోజులపాటు సెలవులు ఉండాలన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ స్కూల్లో 233 రోజులు మాత్రమే పనిచేస్తాయని స్పష్టం చేసింది. అలాగే ఈ సంవత్సరంలో 83 రోజుల పాటు సెలవులు ఉంటాయని ఏపీ సర్కార్.. విద్య సంస్థల క్యాలెండర్ రిలీజ్ చేసింది.

ap schools
ap schools

సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయని కూడా వివరించింది. అటు జనవరి 10వ తేదీ నుంచి… జనవరి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని వెల్లడించింది ఏపీ సర్కార్. మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నట్లు తెలిపింది. మైనారిటీ స్కూల్ లకు దసరా సెలవులు సెప్టెంబర్ 27వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఉంటాయి. అటు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 21వ తేదీ నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు ఉండనున్నాయి. సంక్రాంతి సెలవులు జనవరి 10వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు మైనారిటీ స్కూళ్లలో సెలవులు ఇవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news