తన దృష్టిలో జనసైనికుడిగా పని చేయడం కన్నా గొప్ప పదవి ఇంకేం లేదని జనసేన నేత నాగబాబు అన్నారు. ‘ప్రజల సమస్యలే తన సమస్యగా పవన్ పోరాడుతున్నారు అని తెలిపారు. ప్రజల కోసం వ్యక్తిగత సమయాన్ని, ఆదాయాన్ని, ఆస్తులను పవన్ త్యాగం చేస్తున్నారు. అలాంటి నాయకుడి మాటను శిరసా వహిస్తా అని హామీ ఇచ్చారు. ఆయన పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా జనసైనికుడిగానే పనిచేస్తాం అని స్పష్టం చేశారు. పార్టీ కోసం, నాయకుడి ఆశయాల కోసం పోరాడతాం’ అని ఆయన పేర్కొన్నారు.అలాగే ఎంతో మంది జనసైనికులు, వీర మహిళలు పదవుల కోసం కాకుండా, జనసేన పార్టీ లక్ష్యం కోసం పనిచేసే వారు లక్షల్లో ఉన్నారని అన్నారు.
అలా పార్టీ కోసం నాయకుడి ఆశల కోసం ఆ ఆశలు నిలబెట్టడం కోసం పనిచేస్తున్న జనసైనికులు అందరికీ 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.కాగా, జన సేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ….రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.