తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాంతీయ భావనలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. తెలంగాణ వారికి తాము తెలంగాణ ప్రజలమనే భావన ఉంటుంది. దురదృష్టమో, దౌర్భాగ్యమో తెలియదు కానీ.. మా ఆంధ్రప్రదేశ్ కి కులాల భావన తప్ప మేము ఆంధ్రులం అనే భావన లేదు. ఒకే ఒక్క చోట వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రమే మాకు ఆంధ్రులం అనే భావన వస్తుందని తెలిపారు.
మరోవైపు వైసీపీ పై కూడా విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో గవర్నర్ కి గౌరవం ఇవ్వని పార్టీకి అడుగపెట్టానికి కూడా వీలు లేదన్నారు. ఏపీలో ప్రతిపక్షం అనేది లేదని.. ప్రజలు ఆ అవకాశం ఇవ్వలేదని చెప్పారు. వాళ్లు ప్రతిపక్షంగా ఉండేందుకు ముఖం చాటేస్తున్న సందర్భంలో అధికార పక్షం, ప్రతిపక్షంగా తామే ఉంటామన్నారు. తమలో ఎన్ని ఇబ్బందులు తలెత్తినా కలిసే ఉంటామని.. 15 ఏళ్ల పాటు కలిసే అధికారంలో ఉంటామని పేర్కొన్నారు.