తెలంగాణ ఆరోగ్య రంగ ముఖ చిత్రాన్ని మార్చేందుకు, ఆరోగ్య తెలంగాణ సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ ఆలోచనతో రూపొందించిన తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును ములుగు జిల్లా కలెక్టరెట్ లో ప్రారంభించారు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. అయితే ఈ పథకం ద్వారా ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు ఉనయో తెలుసుకుందాం.
తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ తో ప్రయోజనాలు
హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయడంలో భాగంగా వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి, ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తారు. ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఒక ఐడి నెంబర్ ఇస్తారు. వారి నుంచి నమూనాలను సేకరించి… ఏకంగా 30 రకాల డయాగ్నొస్టిక్ పరీక్షలు నిర్వహిస్తారు. వాటి ఫలితాల ఆధారంగా వారి ఆరోగ్య సమస్యలను నిర్ధారిస్తారు. ఒకవేళ ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే ఉచితంగా చికిత్సలు ప్రారంభిస్తారు.
ఆరోగ్య వివరాలను నీటిని ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తారు. ఈ సమాచారంతో అనేక ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. దీర్ఘకాలిక బాధితులను గుర్తించడం అలాగే వారికి మెరుగైన వైద్యం అందించడం ఈ పథకం ముఖ్య లక్ష్యం. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి రోగాలను ప్రాథమిక దశలోనే గుర్తించడం, రక్తహీనత వంటి సమస్యలను గుర్తించి తగిన చికిత్స అందించడం ఇలా అనేక ప్రయోజనాలు హెల్త్ ప్రొఫైల్ కారణంగా కలుగనున్నాయి.
Speaking at launch of #TelanganaHealthProfile at Mulugu. https://t.co/sfqOgG7yqy
— Harish Rao Thanneeru (@trsharish) March 5, 2022