ఐపీఎల్ వేడుకలో సందడి చేసే సెలబ్రెటీస్ వీరే.. ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే?

-

ఐపీఎల్ ఎప్పుడేప్పుడు స్టార్ట్ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది .ఈనెల 22న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎం చిదంబరం మైదానంలో జరుగుతుంది.

ఈ మ్యాచ్‌కు ముందు ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకను ప్రతిసారీ మాదిరిగానే ఈసారి కూడా అట్టహాసంగా ప్రారంభోత్సవం నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని సన్నాహాలు చేస్తోంది. ప్రారంభ మ్యాచ్ జరిగే చిదంబరం స్టేడియంలో ఐపీఎల్ వేడుకను నిర్వహించనున్నారు. శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ప్రారంభోత్సవం ప్రారంభం కానుంది. దాదాపు గంటపాటు ఈ వేడుక జరగనుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఐపీఎల్ ప్రారంభ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేస్తుండగా, ఐపీఎల్ మ్యాచ్‌లు జియో యాప్‌లో ఉచితంగా వీక్షించవచ్చు.ఈసారి ప్రారంభోత్సవ వేడుకలో బాలీవుడ్ టాప్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్లు ఏఆర్ రెహమాన్, సోనూ నిగమ్ తదితరులు హాజరుకానున్నారని తెలుస్తోంది.చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య రాత్రి 8 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది.ఓపెనింగ్ మ్యాచ్ మినహా అన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news