గూగుల్ లో సత్తా చాటిన చిత్రాలు ఇవే..!

-

2022 కు గాను అత్యధికంగా గూగుల్లో వెతికిన భారతీయ సినిమాలను తాజాగా గూగుల్ ప్రకటించింది. ఈ జాబితాలో పది చిత్రాలలో కేవలం నాలుగు చిత్రాలు మాత్రమే బాలీవుడ్ నుండి చోటు దక్కించుకున్నాయి. ఇందులో ఒక హాలీవుడ్ చిత్రం కూడా ఉంది. మరి ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

2022 గూగుల్ సెర్చ్ రిపోర్ట్ ప్రకారం భారతీయ చలనచిత్రాలలో అత్యధికంగా గూగుల్లో వెతికిన సినిమాగా బ్రహ్మాస్త్ర నిలిచింది. దీనితోపాటు కేజీఎఫ్ చాప్టర్ 2, దికాశ్మీర్ ఫైల్స్, ఆర్ ఆర్ ఆర్ , కాంతారా ఉన్నాయి. ఈ మేరకు గూగుల్ 2022లో ఎక్కువగా సెర్చ్ చేసిన సినిమా పేర్ల జాబితాను విడుదల చేసింది.

శివ అయాన్ ముఖర్జీ నిర్మించిన బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ అత్యధికంగా గూగుల్లో వెతికిన సినిమాగా మొదటి స్థానంలో నిలిచింది . ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా రాణించకపోవడం గమనార్హం. అలాగే కేజిఎఫ్ , చాప్టర్ 2, కాంతారా, ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాలు బ్రహ్మాస్త్ర తర్వాతే నిలిచాయి. బ్రహ్మాస్త్ర సినిమాలో రణబీర్ కపూర్, నాగార్జున, మౌని రాయ్, ఆలియా భట్ , షారుఖ్ ఖాన్ తదితరులు కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా రూ.400 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా కే జి ఎఫ్ చాప్టర్ టు నిలిచింది. అలాగే అత్యధికంగా గూగుల్లో వెతికిన భారతీయ చిత్రంగా కేజిఎఫ్ రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో దికాశ్మీర్ ఫైల్స్.. నాలుగో స్థానంలో ఆర్ ఆర్ ఆర్ నిలవడం గమనార్హం.మరీ కాంతారా ఐదో స్థానంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version