ప్రపంచంలోని కళ్లా నోబెల్ బహుమతులు చాలా గొప్పవి..1947 నుంచి ఇప్పటి వరకూ భారత దేశానికి ఎన్ని నోబెల్ బహుమతులు వచ్చాయో ఇప్పుడు చుద్దాము.. ఎందరో ప్రముఖులు భారత్కు కీర్తి ప్రతిష్టలు అందించి పెట్టారు. విశ్వ వేదికపై భారత్ సత్తా చాటారు. అనేక రంగాల్లో ప్రపంచంలోనే అత్యున్నత నోబెల్ సాధించి పెట్టారు. భారతీయులతోపాటు, భారత సంతతికి చెందిన వాళ్లు ఈ జాబితాలో ఉన్నారు..
స్వాతంత్రం రావడానికి ముందు సాహిత్యంలో రవీంద్ర నాథ్ ఠాగూర్, ఫిజిక్స్లో సీవీ రామన్ నోబెల్ బహుమతి సాధించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మదర్ థెరిసా, అమర్త్య సేన్, కైలాష్ సత్యార్థి వంటి వారు నోబెల్ గెలుచుకున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మన దేశం నుంచి నోబెల్ బహుమతి గెలుచుకుని ప్రపంచ వేదికలపై సత్తా చాటిన మహనీయులను గుర్తు చేసుకుందాము..
సేవకు మారు పేరు మథర్ థెరిస్సా..సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ స్వతంత్ర ప్రతిపత్తి గల ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ అనే సేవాసంస్థను నిర్వహించారు. ఈ సంస్థ ద్వారా మదర్ థెరిసా చేస్తున్న సేవలను గుర్తించిన నోబెల్ బహుమతి కమిటీ ఆమెకు 1979లో నోబెల్ శాంతి బహుమతిని అందించింది…
స్వాతంత్ర భారతంలో దేశానికి మరో నోబెల్ బహుమతి సాధించిపెట్టిన ఆర్థిక నిపుణుడు, తత్వ శాస్త్రవేత్త అమర్త్య సేన్. ఆయనకు 1998లో మానవ అభివృద్ది సిద్ధాంతము, సంక్షేమ ఆర్థికశాస్త్రము, పేదరికానికి గల కారణాలు, పొలిటికల్ లిబరలిజంలలో చేసిన విశేష కృషికిగానూ నోబెల్ బహుమతి లభించింది..
నోబెల్ బహుమతి సాధించిన మరో భారతీయుడు కైలాష్ సత్యార్థి. బాలల హక్కుల కోసం పోరాడుతున్నందుకు గాను, ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 2014లో మలాలా యూసఫ్ జాయ్తో కలిసి నోబెల్ బహుమతి అందుకున్నారు..
మన దేశం నుంచి వేరే దేశానికి వలస వెళ్లిన మరికొంతమంది ప్రముఖులకు కూడా నోబెల్ బహుమతులు దక్కాయి. హర్ గోవింద్ ఖొరానా, సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్, వెంకీ రామకృష్ణన్, అభిజిత్ బెనర్జీకి నోబెల్ దక్కింది..
శరీర ధర్మశాస్త్రం, మెడిసిన్ విభాగంలో నోబెల్ బహుమతి సాధించిన భారతీయ సంతతి వ్యక్తి హర గోవింద్ ఖొరానా. ఆయన భారత్లో జన్మించినప్పటికీ అమెరికాలో 1968లో నోబెల్ బహుమతి సాధించారు..
నోబెల్ బహుమతి అందుకున్న భారత సంతతి వ్యక్తుల్లో సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ ఒకరు. ఆయనకు భౌతిక శాస్త్రంలో 1983లో నోబెల్ బహుమతి దక్కింది…
నోబెల్ బహుమతి పొందిన మరో భారత సంతతి వ్యక్తి వెంకట రామన్ రామకృష్ణన్ అలియాస్ వెంకీ రామకృష్ణన్. జీవ రసాయన శాస్త్రంలో ఆయనకు 2009లో నోబెల్ బహుమతి లభించింది..
నోబెల్ బహుమతి పొందిన మరో భారతీయుడు అభిజిత్ వినాయక్ బెనర్జీ. ఆయనకు 2019లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది..
దేశం నుంచి నోబెల్ అందుకున్న మరో మహనీయుడు 14వ దలైలామా. టిబెట్లో జన్మించిన ఆయన ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. 1959 నుంచి ఇక్కడే ఉంటున్న ఆయనకు 1989లో నోబెల్ శాంతి బహుమతి లభించింది..