సర్జరీ చేయించుకున్న స్టార్ హీరోయిన్స్​ వీరే!!

-

సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్​ ప్రపంచం. ఇక్కడ హీరోలు, హీరోయిన్లు అందంగా కనబడటానికి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అందంగా కనిపించకపోతే ఇక్కడ అవకాశాలు వస్తాయన్న గ్యారెంటీ లేదు. అందుకే అందాన్ని పెంచుకోవడానికి, మరింత అందంగా స్క్రీన్ పై కనిపించడానికి అలాగే తమ ఇమేజ్​ను కాపాడటానికి కొందరు భామల సర్జరీల బాట కూడా పట్టారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ లిస్టు కొంచెం పెద్దదే. మరి అలా అందం కోసం సర్జరీ బాట పట్టిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆసిన్.. తెలుగులో అమ్మ, నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, లక్ష్మీ నర్సింహా, ఘర్షణ, చక్రం చిత్రాల్లో నటించారు. తమిళంలో అమ్మ, నాన్న ఓ తమిళ అమ్మాయి తదితర చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్​లో పాగా వేసింది. అప్పట్లో ఈమె లిప్ సర్జరీ చేయించుకుంది ఈ బ్యూటీ.

శృతిహాసన్.. కమల్​హాసన్​ వారసురాలిగా అడుగుపెట్టి మల్టీటాలెంటెడ్​గా రాణిస్తున్న స్టార్​ హీరోయిన్​Tre శ్రుతిహాసన్​. ప్రస్తుతం ప్రభాస్​, చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల చిత్రాలతో బిజీగా ఉన్న ఆమె అప్పట్లో ముక్కుకి అలాగే పెదవికి కూడా సర్జరీ చేయించుకుంది.

కార్తీక.. రంగం, దమ్ము సహా అడపాదడపా చిత్రాల్లో నటించిన రాధ కూతురు కార్తీక కూడా ముక్కుకి సర్జరీ చేయించుకుంది.

త్రిష.. ఒకప్పుడు తెలుగులో అగ్రకథానాయికగా రాణించి ఇప్పుడు కోలీవుడ్‌లో వరుస అవకాశాలతో అలరిస్తున్న నటి త్రిష. ఈ స్టార్ హీరోయిన్ కూడా ముక్కుకి సర్జరీ చేయించుకుంది.

సమంత.. తెలుగుతో పాటు, తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత, 2012లో తన ముక్కుకు చిన్నపాటి సర్జరీ చేయించుకుంది. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ సినిమాలో ఈ మార్పుని మీరు గమనించవచ్చు.

కాజల్.. ఈ చందమామ హీరోయిన్​ కూడా ముక్కుతో పాటు మొహానికి కూడా చిన్న చిన్న సర్జరీలు చేయించుకుంది.

నయనతార.. లేడీ సూపర్​స్టార్​గా గుర్తింపుతెచ్చుకున్న ఈ బ్యూటీ గతంలో చాలా బొద్దుగా ఉండేది. అది తగ్గడం కోసం సర్జరీ చేయించుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version