మనిషి చనిపోయే ముందు కనిపించే లక్షణాలు ఇవే…!

జన్మించిన ప్రతీ ఒక్కరికి ఎదో ఒక రోజు మరణం ఉంటుంది. అలానే మరణించిన ప్రతి ఒక్కరు తిరిగి జన్మిస్తారు. ఈ విధంగా జనన, మరణాలు ఈ కాల చక్రం లో తిరుగుతూ ఉంటాయి. ఇది సర్వ సాధారణం. ఇది ఇలా ఉంటె మనం పుట్టినప్పుడు మన శరీరం లోకి మనతో పాటు ఆత్మ కూడా వస్తుంది. అయితే ఆత్మ శరీరం నుంచి వెళితే అప్పుడు మనకు మరణం సంభవిస్తుంది. ఇక మరణం విషయానికి వస్తే… ఇది సహజంగానైనా లేదా వృద్ధాప్యం వల్ల లేకుంటే ఆత్మహత్య చేసుకోవడం, హత్య చేయబడటం ఇలా మరి కొన్ని రకాలలో రావచ్చు.

ఇక సహజ మరణం పొందిన వారి ఆత్మ పరమాత్మ సన్నిధి లో ఐక్యమవుతుంది. కానీ ప్రమాదాల వల్ల మరణించిన వారి ఆత్మ దైవ సన్నిధికి చేర లేక భూలోకంలో రాలేక, వారికి తీరని ఆంక్షలు ఉండటం వల్ల కొట్టుమిట్టాడుతుంది అని అంటారు. ఇది ఇలా ఉంటె పురాణాల ప్రకారం సహజమైన మరణం వచ్చినప్పుడు మనలో కొన్ని లక్షణాలు ముందు గానే కనిపిస్తాయని తెలుస్తోంది.

మరి ఆ లక్షణాలు ఏమిటి అనే విషయానికి వస్తే … ఎవరైనా చనిపోయే కొద్ది రోజుల ముందు వాళ్ళ శరీరం తెలుపు రంగులో లేదా పసుపు రంగు లోకి మారుతుంది. అలానే కళ్ళు కూడా ఎర్రగా మారుతాయి. ఇలా చనిపోయే ముందు మనిషి రంగు లో మార్పులు కనపడతాయి. మనిషి ప్రతిబింబం కనుక అద్దం, నీటిలో, నూనెలో కనిపించినప్పుడు అది మన మరణానికి సిగ్నల్ అని అంటారు.