నేడు రామతీర్ధానికి చినజీయర్ స్వామి

Join Our COmmunity

కొద్ది రోజుల క్రితం వరకు రామతీర్థం రాజకీయ నాయకుల పర్యటనలతో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ రోజు రామ తీర్థాన్ని చిన్న జీయర్ స్వామి దర్శించునున్నారు. విశాఖ నుంచి రామతీర్థం వెళ్లనున్న చిన్న జీయర్ స్వామి బోడి కొండ మీద ఉన్న రాముడిని దర్శించుకోనున్నారు. ఇక మరో పక్క రామ తీర్థం ఆలయం కోసం తిరుపతిలో విగ్రహాలు సిద్దమవుతున్నాయి.

ధ్వంసమైన రాముడి విగ్రహం తో పాటు సీతాదేవి, లక్ష్మణుల విగ్రహాల తయారి జరుగుతోంది. తిరుపతిలోని టీటీడీకి చెందిన సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప సంస్థలో విగ్రహాల తయారీ జరుగుతోంది. కంచి నుంచి రాయిని తెప్పించి విగ్రహాలను చెక్కుతున్నారు శిల్పులు. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. మరో పది రోజుల్లో మూడు విగ్రహాలను శిల్పులు అందించనున్నారు. 

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news