కామన్ సెన్స్ లేదని తెలియజేప్పే ఈ పనులు అస్సలు చేయకండి..

-

కామన్ సెన్స్.. ఇంగిత జ్ఞానం.. చాలా మందికి ఉండనిది. అస్సలు ఆలోచించనిది. చిన్న చిన్న విషయాల ద్వారానే ఒక మనిషికి కామన్ సెన్స్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. కామన్ సెన్స్ లేని వారిని ప్రపంచం పట్టించుకోదు. అస్సలు అటు వంక కూడా చూడదు. మీకు కామన్ సెన్స్ లేదని తెలియజెప్పే విషయాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఎదుటివారి బట్టలపై కామెంట్ చేయవద్దు. వారు వేసుకున్న డ్రెస్ మీకు నచ్చకపోతే కామ్ గా ఉండండి. అంతేకానీ, అందరి ముందు మీ డ్రెస్ బాలేదని చెప్పవద్దు.

పబ్లిక్ ప్లేస్ లో విజిల్ వేయడం సరైన పని కాదు. మీకు అలాంటి అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. విజిల్ వేయడం అనేది వేల రకాలుగా పోతుంది. సో.. పబ్లిక్ ప్లేస్ లో విజిల్ వద్దు.

మీతో కొద్దిపాటి పరిచయం ఉన్న వ్యక్తులని సాలరీ ఎంత అని అడగవద్దు. సాలరీ అనేది చాలా పర్సనల్. అందుకే అప్పుడే పరిచయం అయినవారితో సాలరీ గురించి మాట్లాడవద్దు.

మెడికల్ షాపులో ఉన్నప్పుడు కండోమ్స్ లేదా శానిటరీ నాప్ కిన్స్ కొంటున్న వ్యక్తి వైపు అదేపనిగా చూడవద్దు.

ఎంతో దూరం నుండి మీ దగ్గరకి వచ్చిన వారికి కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వండి. వాళ్ళు పోస్ట్ మాన్ అయినా సరే. నీళ్ళు తాగుతారా అని అడగండి చాలు.

అవతలి వారి పొజిషన్ ని కాకుండా మనుషుల్ని గౌరవించడం నేర్చుకోవాలి.

మీ ఆఫీసులో పనిచేసే ఊడ్చేవాళ్ళతో అయినా, మీ పై అధికారితో అయినా ఒకేలా ఉండండి. మీతో పాటూ వాళ్ళూ పనిచేస్తున్నారని తెలుసుకోండి.

మీకు జ్వరంగా ఉన్నప్పుడు పబ్లిక్ ప్లేస్ లోకి రాకపోవడమే మంచిది.

తలుపులు మూసి ఉన్నప్పుడు డోర్ కొట్టి పిలవండి.

రైళ్ళలో గానీ, బస్సుల్లో గానీ దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మీ పక్కనున్న వారికి ఇవ్వకుండా మీరొక్కరే తినడం సరైన పద్దతి కాదు. వాళ్ళు తిన్నారో లేదో కనీసం ఒకసారి అడగండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version