డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్స్ ఫెయిల్ రేట్ ఎక్కువ‌గా ఉన్న బ్యాంకులు ఇవే..!

-

దేశంలో ప్ర‌ధాని మోదీ పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన‌ప్ప‌టి నుంచి డిజిట‌ల్ లావాదేవీలు పెరిగాయి. ఇక క‌రోనా నేప‌థ్యంలో జ‌నాలు మ‌రింత డిజిట‌ల్ బాట ప‌ట్టారు. దీంతో డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలో ఇటీవ‌లి కాలంలో ట్రాన్సాక్ష‌న్లు పెరిగాయి. న‌గ‌దు వెంట లేకున్నా ఎక్క‌డైనా ఎప్పుడైనా ప్ర‌జ‌లు డిజిట‌ల్ రూపంలో న‌గ‌దును చెల్లించేందుకు వీలు క‌లుగుతోంది. అయితే దీని వ‌ల్ల లాభం ఉన్న‌ప్ప‌టికీ స‌ద‌రు లావాదేవీల్లో కొన్ని ఫెయిల్ అవుతుండ‌డం జ‌నాల్లో ఆందోళ‌నను క‌లిగిస్తోంది.

ఇక డిజిట‌ల్ ట్రాన్సాక్షన్ల ఫెయిల్ రేట్ విష‌యంలో ప్ర‌భుత్వ బ్యాంకులే ముందు వ‌రుస‌లో ఉన్నాయి. అత్య‌ధికంగా కెన‌రా బ్యాంక్‌కు చెందిన క‌స్ట‌మ‌ర్లు చేసే డిజిట‌ల్ లావాదేవీలు ఫెయిల్ అవుతున్నాయ‌. ఈ క్ర‌మంలో ఈ విష‌యంలో కెన‌రా బ్యాంక్ డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్ల ఫెయిల్ రేట్ 9.8 శాతంగా ఉంది. అదే బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే 4.2 శాతం, ఎస్‌బీఐ అయితే 3.7 శాతం గా ఉంది.

కాగా ప్రైవేటు బ్యాంకులు ఈ విష‌యంలో కొంత న‌యం అనే చెప్ప‌వ‌చ్చు. అయిన‌ప్ప‌టికీ కోట‌క్ మ‌హీంద్రా బ్యాంక్‌కు చెందిన డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్ల ఫెయిల్ రేట్ 2.36 శాతం ఉండ‌గా, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ల‌కు చెందిన డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్ల ఫెయిల్ రేట్ 1 శాతంగా ఉంది. ఈ వివ‌రాల‌ను నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వెల్ల‌డించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version