సెలవుల గురించి గొడవ. టీచర్ ని కాల్చి చంపిన మరో టీచర్ !

-

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న 35 ఏళ్ల ఉపాధ్యాయురాలిని పాఠశాల ప్రాంగణంలో ఆమెతో పని చేసే ఒక ఉపాధ్యాయుడు కాల్చి చంపారు. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా సదరు టీచర్ మహిళ మరణించింది. సీతాపూర్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) ఆర్.పి.సింగ్ ప్రకారం, ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. ఉపాధ్యాయురాలు ఆరాధన రాయ్ ను ఆమె సహోద్యోగి అమిత్ కౌశల్ రెండు సార్లు కాల్చారు. నిందితుడిని అరెస్టు చేశారు.

పాఠశాల రిజిస్టర్‌లోని సాధారణం సెలవులకు సంబంధించిన ఎంట్రీపై ఇద్దరూ వాగ్వాదానికి దిగడంతో ఈ సంఘటన జరిగింది. ఈ వాదన కౌశల్ కు కోపం తెప్పించింది. దీంతో కంట్రోల్ చేసుకోలేని అతను ఆరాధనను కాల్చి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆరాధనకు కౌషల్‌ తో ఎఫైర్ ఉందని, అయితే వారి సంబంధాలు ఇటీవల దెబ్బతిన్నాయని అంటున్నారు. దీంతో ఆమె కౌశల్‌ పై పాఠశాల అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అధికారులు విచారణ జరిపి, కౌషల్‌ కు హెచ్చరికలు జారీ చేశారు.ఇది మనసులో పెట్టుకునే సెలవుల వంకతో ఆమెను కాల్చిచంపాడని భావిస్తున్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version