టాలీవుడ్ సెలబ్రిటీల్లో వీళ్లే బెస్ట్ ఫ్రెండ్స్…!

-

నిజానికి టాలీవుడ్ లో చాలా మంచి కల్చర్ ఉంది. చాలామంది అగ్రహీరోల్లో ఫ్రెండ్స్ ఉన్నారు. ఎటువంటి బేషజాలకు పోకుండా.. చాలామంది హీరోలు.. తోటి హీరోలతో స్నేహం కొనసాగిస్తున్నారు.

వచ్చేసింది.. ఫ్రెండ్ షిప్ డే వచ్చేసింది. ఇంకో రెండు రోజుల్లోనే ఫ్రెండ్ షిప్ డే.  స్నేహితుల దినోత్సవం అంటేనే ఫ్రెండ్స్ అంతా కలిసి సరదాగా గడిపి.. తమ స్నేహ బంధాన్ని గుర్తు చేసుకుంటారు. కలకాలం తమ స్నేహం ఇలాగే కొనసాగాలని కోరుకుంటారు. అయితే.. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఈసారి మనం టాలీవుడ్ సెలబ్రిటీల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకుందామా?

నిజానికి టాలీవుడ్ లో చాలా మంచి కల్చర్ ఉంది. చాలామంది అగ్రహీరోల్లో ఫ్రెండ్స్ ఉన్నారు. ఎటువంటి బేషజాలకు పోకుండా.. చాలామంది హీరోలు.. తోటి హీరోలతో స్నేహం కొనసాగిస్తున్నారు. ఆ కోవలోకి వచ్చే వాళ్లలో మొదటి వరుసలో ఉండేవాళ్లు… చిరంజీవి, నాగార్జున. అవును.. వీళ్లిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఆ తర్వాత పవన్ కల్యాణ్, వెంకటేశ్ రెండో వరుసలోకి వస్తారు. వీళ్లిద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్లిద్దరు కలిసి గోపాలా గోపాలా సినిమాలో కూడా నటించారు.

ఆ తర్వాత పవన్ కల్యాణ్, అలీ.. వీళ్లిద్దరూ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచీ బెస్ట్ ఫ్రెండ్స్. అలీ లేని పవన్ కల్యాణ్ సినిమా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. అలీ నా గుండెలాంటి వాడని పవన్ ఎన్నోసార్లు ఎన్నో వేదికల మీద చెప్పారు.

రాజమౌళి ఎక్కువగా ఏ హీరోతో సినిమాలు తీశారు…. అని అడిగితే టక్కున వచ్చే సమాధానం జూనియర్ ఎన్టీఆర్. అవును… రాజమౌళి తను దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎక్కువగా ఎన్టీఆర్ తోనే తీశారు. స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ.. మూడు సినిమాలు ఎన్టీఆర్ తో తీశారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ తీస్తున్నారు. వీళ్లిద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. రాజమౌళికి ఇష్టమైన హీరో కూడా ఎన్టీఆరే. రాజమౌళి ఎన్టీఆర్ ను ముద్దుగా తారక్ అని పిలుస్తారు. ఎన్టీఆర్ కూడా రాజమౌళిని ముద్దుగా జక్కన్న అని పిలుస్తారు.

ఆ తర్వాత ప్రభాస్, గోపీచంద్… వీళ్లిద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్సే. వీళ్లిద్దరు కలిసి తొలిసారి వర్షం సినిమాలో నటించారు. వర్షం సినిమాతోనే వీళ్ల స్నేహం కూడా బలపడిందట. వర్షం సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్… హీరోగా నటించాడు.

మరో స్టార్ హీరో రామ్ చరణ్, రానా.. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్సే. వాళ్లిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి ఒకే స్కూల్ లో చదువుకున్నారు. అందుకే వాళ్లది బాల్య స్నేహం. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్లు బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉన్నారు.

త్రివిక్రమ్, సునీల్.. ఇద్దరూ ఇండస్ట్రీకి రాకముందే బెస్ట్ ఫ్రెండ్స్ అట. శ్రీకాంత్, శివాజీరాజా కూడా బెస్ట్ ఫ్రెండ్సే. పూరి జగన్నాథ్, రవితేజ కూడా బెస్ట్ ఫ్రెండ్స్. వ్యక్తిగత విషయాలు కూడా షేర్ చేసుకునేంత స్నేహం వాళ్లది.

మరోవైపు నాచురల్ స్టార్ నానికి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నా… అల్లరి నరేష్ మాత్రం నా బెస్ట్ ఫ్రెండ్ అని చెబుతుంటాడు నాని. శర్వానంద్, నాని, అల్లరి నరేశ్.. వీళ్లు ముగ్గురు కూడా బెస్ట్ ఫ్రెండ్సే.

మనకు తెలియని మరో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? సూపర్ స్టార్ మహేశ్ బాబు, సుమంత్. అవును… వీళ్లిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అప్పుడప్పుడు కలిసి సరదాగా గడుపుతుంటారు ఇద్దరు.

జూనియర్ ఎన్టీఆర్ కు రాజమౌళి ఎంత దగ్గరో… రాజీవ్ కనకాల కూడా అంతే. ఎన్టీఆర్ కు ఎప్పుడూ వెన్నంటే ఉంటాడు రాజీవ్. రామ్ చరణ్, శర్వానంద్ కూడా బాల్య మిత్రులట.

నితిన్ సినిమా గుండెజారి గల్లంతయ్యిందేకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన నీరజ… నితిన్ కు బెస్ట్ ఫ్రెండ్ అయింది. వాళ్లిద్దరు ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్.

Read more RELATED
Recommended to you

Exit mobile version