తెలంగాణలోని ఈ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు

-

తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. అయితే, వర్షాకాలం కురవాల్సిన దానికంటే ఎక్కువగా కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రతిఏటా రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 738 మీమీ కురుస్తుంది. ఈ మేరకు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ ఈ సీజన్‌లో సెప్టెంబర్ 11 వరకు 897 మీమీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు నిర్దారించారు.రాష్ట్రంలోని పలు జిల్లాలో ఈ రికార్డు నమోదు అయ్యిందని తెలిపారు.

ముఖ్యంగా సిద్ధిపేట,మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, మహబూబ్ నగర్, గద్వాల జిల్లాల్లో అత్యధిక వర్షాలు కురిసాయని పేర్కొన్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఈసారి సాధారణ వర్షపాతం నమోదవ్వగా, మిగిలిన జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు అయ్యిందని ఐఎండీ అధికారులు తేల్చారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టినా రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news