బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మరో వారం, పది రోజుల్లో తమ పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించనున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలం అయ్యిందని, రైతు భరోసా, అసంపూర్ణ రుణమాఫీ, పంటపరిహారం, అన్నదాతల ఆత్మహత్యలు, తమ పార్టీ నేతలపై దాడులు వంటి ఇతర అంశాలపై కూడా చర్చింనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా భవిష్యత్‌లో పార్టీకి తిరిగి మైలేజీ తీసుకువచ్చేందుకు కేసీఆర్ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని సమాచారం.
ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు అనుబంధ విభాగాల అధ్యక్షులు హాజరువుతారని సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను కేసీఆర్ నిశితంగా పరిశీస్తున్నారని, త్వరలోనే ఆయన ప్రజాక్షేత్రంలోకి దిగుతారని గులాబీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.