అబ్బాయిలూ ఈ అలవాట్లు ఉంటే.. అమ్మాయిలే మిమ్మల్ని ఇష్టపడతారుట..!

-

అబ్బాయిలు అమ్మాయిలని పడేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ నిజానికి ప్రతి అమ్మాయి కూడా అబ్బాయి తనకు తగ్గ వాడా కాదా..?, బాగా చూసుకుంటా లేదా..? ఇలా వాళ్ళు చూసుకుని అప్పుడే ప్రేమలో పడతారు లేదంటే లవ్ ని యాక్సెప్ట్ చెయ్యరు.

నిజానికి చాలామంది అబ్బాయిలు ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కానీ అమ్మాయిని ప్రేమలో పడేయడానికి కానీ చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయినప్పటికీ ఒక్కొక్కసారి కుదరదు. అయితే ఈ లక్షణాలు కనుక అబ్బాయిలలో ఉంటే కచ్చితంగా అమ్మాయిలు వాళ్ళని ఇష్టపడతారట. మరి ఎటువంటి లక్షణాలు అబ్బాయిలలో ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం. నిజానికి ఈ లక్షణాలు కనుక ఉంటే అమ్మాయిలు కచ్చితంగా ఫిదా అయిపోతారు.

ఆత్మవిశ్వాసం ఉండాలి:

ఖచ్చితంగా అబ్బాయిలకి ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం లేకపోతే కనీసం వాళ్ళ మనసులో మాటలు కూడా పైకి చెప్పలేరు. పైగా ఆత్మవిశ్వాసం లేని అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడరు కూడా. ఎటువంటి నిర్ణయాన్ని కూడా వారు సరిగా తీసుకోలేరు కనుక అబ్బాయిలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి.

ఇతరులను గౌరవించడం:

ఇతరులను గౌరవించడం చాలా ముఖ్యం పెద్దవాళ్ళను గౌరవించడం స్త్రీలను గౌరవించడం ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఇవి అమ్మాయిలు చూసి ఇష్టపడతారు.

పరిశుభ్రంగా ఉండటం:

శుభ్రత చాలా ముఖ్యం పరిశుభ్రంగా కనపడకపోతే ఎవరూ దగ్గరికి కూడా రారు మంచిగా గ్రూమింగ్ చేసుకోవడం చాలా అవసరం కాబట్టి అబ్బాయిలు ఇటువంటి వాటిని కచ్చితంగా ఫాలో అవ్వండి.

ఫిట్ గా ఉండడం:

శరీరాకృతిని చూసి చాలామంది అమ్మాయిలు ఇష్టపడతారు కాబట్టి దీనిపై కూడా కాస్త ధ్యాస పెట్టండి ఇలా అబ్బాయిలు కనుక వీటిని ఫాలో అయ్యారంటే కచ్చితంగా అమ్మాయిలు మీకు ఫిదా అయిపోతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version