మన దేశంలో చాలామంది సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవిస్తారు..అందుకే నిత్యం దేవుడిని ప్రార్ధిస్తారు. ప్రత్యేకమైన రోజుల్లో అయితే చెప్పనక్కర్లేదు.. ప్రత్యేక పూజలు, వ్రతాలు చేస్తారు.అయితే ప్రతి రోజు దీపం పెట్టకుంటే మాత్రం దినాము నష్టం అని అంటారు.అయితే దీపం పెట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అసలు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
దీపం పరబ్రహ్మ స్వరూపం కాగా దీపారాధన చేయడం ద్వారా శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి.దీపాన్ని వెలిగించే సమయంలో కొన్ని నియమాలను పాటించడం ద్వారా మరింత ఎక్కువగా శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.ఉదయం, సాయంత్రం స్నానం చేసిన తర్వాత దీపాలను వెలిగిస్తే మంచిదని చెప్పవచ్చు. ఏదైనా కారణం వల్ల సాయంత్రం సమయంలో స్నానం చేయడం సాధ్యం కాని పక్షంలో కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుని దేవుడిని పూజిస్తే మంచి జరుగుతుందని చెప్పవచ్చు.
దీపారాధన వల్ల కుటుంబం వృద్ధిలోకి రావడంతో పాటు మనలో జ్ఞానం పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. దీపారాధాన చేసిన ఇంట్లో పిల్లలు వృద్ధిలోకి రావడంతో పాటు శాంతి నెలకొంటుంది.వెలుగు తో దేవుడికి స్వాగతం చెబుతారు కనుక అన్నీ శుభాలు కలుగుతాయని అంటున్నారు.దీపానికి నమస్కరించడం వల్ల శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఆవు నెయ్యి, నువ్వుల నూనె జ్యోతులను వెలిగించడానికి మంచిదని చెప్పవచ్చు..ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం రెండు ఒత్తులతో దీపం పెట్టాలి.స్టీల్, ఇనుప ప్రమిధలలో దీపం వెలిగించకూడదు.రాగి, వెండి వాటిలో వెలిగించడం మంచిది.