శీతాకాలంలో పశువుల ఆరోగ్యం పై ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

-

శీతాకాలంలో మనుషులతో పాటు పశువులకు కూడా అనేక వ్యాధులు రావడం సహజం..ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గడంతో అవి అసౌకర్యానికి గురవుతాయి.జీర్ణ వ్యవస్ధ మందగిస్తుంది. ఆహారం సక్రమంగా తీసుకోకపోవటం వల్ల పశువులో పోషకాలు తగ్గిపోతాయి. అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో పాల ఉత్పత్తి తగ్గుతుంది. కాబట్టి శీతాకాలంలో పశుపోషణలో తగిన జాగ్రత్తలు పాటించాలని పశువైద్య నిపుణులు సూచిస్తున్నారు.. ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

శీతాకాలంలో పశువులకు పాటించాల్సిన జాగ్రత్తలు..

*. పశువులకు అందించే ఆహారంలో మార్పులు చేయాలి. సాధారణంగా ఇచ్చే ఆహారానికి భిన్నంగా శీతాకాలంలో సమీకృత ఆహారంలో ఫాస్పెట్ అధికంగా ఉండే గోధుమ తవుడుతో తయారైన దాణాను అందించాలి.

*. పశువులను ఉంచే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గాలి , వెలుతురు వచ్చే విధంగా మురికినీరు బయటకు వెళ్ళే విధంగా ఏర్పట్లు చేసుకోవాలి. చలిని తట్టుకునేలా పాకల్లో వేడి ఉష్ణోగ్రతలు కల్పించేలా చుట్టూ పట్టాలను కట్టుకోవాలి. అవసరమనుకుంటే నేలపై ఎండుగడ్డిని పరుచుకోవాలి.
*. రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.. అందుకే వాటికి పొషక పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి..
*. పశువులు గర్భంతో ఉంటే పిండం పెరుగుదలకు కావాల్సిన అధిక పోషకాహారం తప్పక ఇవ్వాల్సి ఉంటుంది.
*. శీతాకాలంలో గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు వంటి అంటువ్యాధులు సోకే అవకాశం ఉన్నందున ముందుగానే నివారణ చర్యగా వ్యాధినిరోధక టీకాలు వేయించాలి. పశువుల జీర్ణ ప్రక్రియ మందగించకుండా చర్యలు తీసుకోవాలి.
*. వాటిని ఉంచే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గాలి , వెలుతురు వచ్చే విధంగా మురికినీరు బయటకు వెళ్ళే విధంగా ఏర్పట్లు చేసుకోవాలి. చలిని తట్టుకునేలా పాకల్లో వేడి ఉష్ణోగ్రతలు కల్పించేలా చుట్టూ పట్టాలను కట్టుకోవాలి..మరీ తక్కువ ఉష్ణోగ్రతలు అయితే

Read more RELATED
Recommended to you

Exit mobile version