పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఈ నష్టాలు వస్తాయి…!

-

మనకి పాన్ కార్డు, ఆధార్ కార్డు చాలా ముఖ్యమైన డాక్యుమెంట్స్. వీటి వలన చాలా ఉపయోగం వుంది. అయితే ఈ రెండిటినీ లింక్ చెయ్యడం కూడా చాలా ముఖ్యం. అయితే లింక్ చెయ్యకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం.

 

బ్యాంక్ ఖాతా నిలిచిపోవచ్చు:

ఈ రెండిటినీ లింక్ చెయ్యడం చాలా అవసరం. లేదు అంటే సెంట్రల్ KYC లేదా ఇ-KYC చేయబడవు. అటువంటి పరిస్థితిలో బ్యాంక్ సరితను గుర్తించలేకపోతుంది. అలానే ఖాతా కూడా నిలిచిపోవచ్చు. ఒకవేళ లింక్ చెయ్యకపోతే ఫ్యూచర్ లో డెబిట్, క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు కూడా చెయ్యడం అవ్వదు.

డిజిటల్ లోన్ రాదు:

డిజిటల్ లోన్ లేదా తక్షణ రుణం ఆన్‌లైన్‌లో లభిస్తుంది. దీనిని మనం క్షణంలో పొందవచ్చు. అయితే పాన్ కార్డును ఆధార్ లింక్ చేసినప్పుడు మాత్రమే ఇది చాలా ఈజీగా పూర్తవుతుంది. లేదు అంటే అవ్వదు.

రూ. 50 వేలకి మించి చెల్లించలేరు:

మీరు హోటల్ లేదా రెస్టారెంట్ బిల్లు చెల్లించాలి అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. మీరు ఒకేసారి 50 వేల రూపాయల కంటే ఎక్కువ బిల్లు చెల్లించలేరు. కనుక ఆధార్ ని పాన్ ని లింక్ చేసుకోండి. లేదు అంటే ఈ ఇబ్బంది కూడా ఉంటుంది.

చెక్కు, బ్యాంక్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లింపులో సమస్యలు:

ఒక రోజులో 50 వేలకు పైగా లావాదేవీ జరిగితే చెక్, డ్రాఫ్ట్ లేదా పే ఆర్డర్ ద్వారా చేయలేరు. కనుక మీరు మీ పాన్ కార్డు ఆధార్‌ను సకాలంలో లింక్ చేయడం. లేదు అంటే ఈ సమస్య కూడా ఉంటుంది.

స్టాక్ మార్కెట్‌లో ఇబ్బందులు:

డిమాట్ ఖాతా ఓపెన్ చెయ్యలేరు పాన్ కార్డును ఆధార్ లింక్‌తో లింక్ చేయకపోతే. అలానే మార్కెట్లో ఎలాంటి వాటాలను కొనుగోలు చేయడం అవ్వదు. కనుక లింక్ చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version