రైలు బోగీల మీద వుండే ఈ గీతలు డిజైన్ కాదు.. దీని వెనుక పెద్ద కారణమే వుంది తెలుసా..?

-

చూడడానికి కొన్ని సింపుల్ గా దాని వెనక అర్థం ఏమి లేనట్లుగా కనబడుతూ ఉంటాయి. నిజానికి ప్రతి దానిని చూసి మనం అలా అనుకుంటే పొరపాటే. రైలు బోగీల పై గీతలు ఉంటాయి. చాలా మంది అది ఏదో డిజైన్ అని అనుకుంటారు. కానీ నిజానికి దీని వెనక చాలా పెద్ద కారణం ఉంది. అయితే మరి రైలు బోగీల పై ఉండే గీతల వెనక కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

 

ఎక్కువగా రైలు బోగీలు పై తెలుపు, పసుపు, ఆకుపచ్చ రంగులలో కనబడుతూ ఉంటాయి. నీలం రంగు బోగీ పై వైట్ కలర్ గీతలు ఉంటాయి దానికి అర్థం అది జనరల్ బోగి అని. ఆ జనరల్ బోగీలో ఎవరైనా సరే ట్రావెల్ చేయొచ్చు. వైట్ కలర్ గీతలు ఉండే బోగిలలో సీట్లను రిజర్వేషన్ చెయ్యడానికి అవ్వదు అని గుర్తుపెట్టుకోవాలి.

అదే గీతలు వైట్ కలర్ లో కాకుండా ఎల్లో కలర్ లో ఉన్నాయి అంటే ఆ బోగి అనారోగ్యంతో ఉన్న వాళ్ళకు, దివ్యాంగులకు మాత్రమేనని మనం తెలుసుకోవాలి, ఇది ఇలా ఉంటే గ్రీన్ కలర్ లో లేదా గ్రే కలర్ లో బోగీలు ఉంటే ఆ బోగీలు కేవలం మహిళలకు మాత్రమే అని అర్థం. రైలులో మొదట కానీ చివర కానీ ఈ బోగీలు మనకి కనబడతాయి.

బోగీలపై గ్రే కలర్ పై ఎరుపు రంగు గీతలు ఉంటే అది ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ అని అర్థం. చూసారా రైలు పెట్టెలు వెనకాల ఉండే గీతల వెనక ఎంత అర్థం ఉందో.. కానీ మనం డిజైన్ ఏమో అని అనుకుంటూ ఉంటే అది పొరపాటే. ఈ సారి ఈ గీతలు ద్వారా ఆ బోగి ఏమిటో మీరూ చెప్పేయచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news