ఒక్కొక్క సరి వివిధ కారణాల వలన ఉద్యోగం మారుతూ ఉంటాం. చేరిన ప్రతీ సంస్థలో ఈపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయడం, మరో కంపెనీకి మారగానే అక్కడ కూడా ఈపీఎఫ్ అకౌంట్ తెరుస్తారు ఉద్యోగులు. అయితే చాల మంది తమ పాత ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ చేసిన డబ్బుల గురించి పెద్దగా పట్టించుకోరు. దీని వల్ల నష్టపోతూ ఉంటారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని ఒకే యూఏఎన్ నెంబర్లపై ఈపీఎఫ్ అకౌంట్ కొనసాగించే అవకాశం కల్పిస్తోంది కంపెనీ. వేర్వేరు కంపెనీల్లో జమ చేసిన మొత్తాన్ని కూడా మెర్జ్ చేసి ఒకే పాస్‌బుక్‌లో చేర్చొచ్చు. ఇందుకోసం ఈపీఎఫ్ అకౌంట్లను మెర్జ్ చేయాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ అకౌంట్స్ మెర్జ్ చేయకుండా పాత అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేస్తూ ఉంటారు. అయితే ఉద్యోగం మారిన తర్వాత పాత అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయాలంటే వీటిని గుర్తు పెట్టుకోండి.
ఎగ్జిట్ డేట్ లేకపోతే ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయడం అంత సులువు కాదు. ఈపీఎఫ్ ఖాతాదారులే ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేసే అవకాశం కల్పిస్తోంది. అంటే ఈపీఎఫ్ ఖాతాదారులు కంపెనీపై ఆధారపడకుండా తామే ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేయొచ్చు. కనుక దీనిని అస్సలు మరిచిపోవద్దు. ఉద్యోగి తాము జాబ్ మానేసిన రోజునే డేట్ ఆఫ్ ఎగ్జిట్‌గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆన్‌లైన్‌లోనే డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఎంటర్ చేయొచ్చు. ఈ విధంగా ఎంటర్ చెయ్యచ్చు.
ముందుగా https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ యూఏఎన్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి.
క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.
ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
తర్వాత మేనేజ్ పైన క్లిక్ చేయాలి.
Mark Exit ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
ఇప్పుడు డ్రాప్‌డౌన్‌లో ఎంప్లాయ్‌మెంట్ పైన క్లిక్ చేయాలి.
మీ యూఏఎన్ అకౌంట్ నెంబర్‌కు లింక్ అయిన పాత పీఎఫ్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేయాలి.
ఉద్యోగం వదిలిపెట్టడానికి గల కారణాన్ని వివరించాలి.
ఆ తర్వాత Request OTP పైన క్లిక్ చేయాలి.
ఈపీఎఫ్ అకౌంట్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
దైనల్ గా ఓటీపీ ఎంటర్ చేసి OK క్లిక్ చేస్తే చాలు.