ఏలూరు ఘటన జాతీయ స్థాయిలో సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన విషయంలో ఏపీ సర్కార్ కాస్త ఎక్కువగా దృష్టి సారించింది. ఏలూరు ఆసుపత్రి నుంచి హైదరాబాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థకు రెండు రోజుల క్రితం నీటి శాంపిల్స్ ను అధికారులు పంపించారు. శాంపిల్స్ ప్రకారం నివేదిక ఐఐసీటీ ఇచ్చింది. తాగు నీటిలో అధికంగా బ్లీచింగ్ లేదా క్లోరినేషన్ చేసి ఉండవచ్చు అని అభిప్రాయపడింది…?
పంటలకు వాడే ఫాస్పేట్ ఆధారిత రసాయనాలు తాగు నీటిలో కలిసి ఉండవచ్చు అని అభిప్రాయపడ్డారు. తాగునీటిలో ఫాస్పేట్, క్లోరో కలిసింది లేనిది తెలియడానికి అధునాతన ఐసీపీయంయస్ పరీక్ష చేయాలి అని నివేదికలో వెల్లడించారు. ఈ రోజు ఏలూరులో క్షేత్రస్థాయిలో పరీక్షలు ఐఐసీటీ బృందం చేస్తుంది.