జగన్ కి చాలా చాలా వీక్ చేసేస్తోంది వాళ్ళే ?? వెనకే ఉండి గట్టి దెబ్బ ?

-

పరిపాలన పరంగా మరియు సంక్షేమ పరంగా వైయస్ జగన్ అద్భుతంగా పరిపాలిస్తున్నాడు అని దేశ స్థాయిలో ఉన్న సీనియర్ రాజకీయ నేతలే కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని ప్రముఖ సంస్థల సర్వేల్లో మంచి ముఖ్యమంత్రిగా దేశంలోనే మూడవ స్థానం వైయస్ జగన్ కి దక్కింది. అంతా బాగానే ఉన్నా ప్రభుత్వంలో మరియు పరిపాలన విషయంలో ఎక్కడ అవినీతి లేకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తున్న జగన్ కి మాత్రం లీగల్ గా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

తీసుకున్న నిర్ణయాలను కొంతమంది ఉద్దేశపూర్వకంగా మరియు రాజకీయంగా న్యాయస్థానంలో ప్రభుత్వ నిర్ణయాలను సవాలు చేస్తూ కొన్ని కీలకమైన విషయాల్లో అడ్డుకోవడం జరిగింది. అంతా బాగానే ఉన్న కానీ వైఎస్ జగన్ కి కోర్టు కష్టాలు, మొట్టికాయలు బాగా ఎదురవుతున్నాయి. ప్రభుత్వపరంగా ఇచ్చిన జీవోలను గురించి ప్రభుత్వం తరపు సరైన విధంగా న్యాయస్థానములో లాయర్లు వాదించ లేకపోవటంతో రాజకీయంగా జగన్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

 

చాలా వరకు తీసుకున్న నిర్ణయాలు కోర్టు లోకి వెళ్ళిన టైములో జగన్ కి మొట్టికాయలు చాలా సందర్భాలలో పడ్డాయి. ఇటీవలే అన్ని రకాలుగా కోర్టుల నుంచి ఎదురుదెబ్బలు తిన్నారు. కర్నూలో విజిలెన్స్ ఆఫీసుల తరలింపు, స్థానిక ఎన్నికల వాయిదాపైన, పంచాయతీ ఆఫీసులకు రంగులు వేయడం పైన, తాజాగా ఇంగ్లీష్ మీడియం విషయంలో జీవో పైనా, అమరావతిలో పేదలకు ఇళ్ళపట్టాలపైనా ఇలా జగన్ కి అన్నీ మొట్టికాయలే పడ్డాయి. దీంతో మొత్తం ఈ పరిణామాలపై  ప్రభుత్వం తరుపున వాదించే లాయర్లు వెనక ఉండి జగన్ కి గట్టి దెబ్బ వేస్తున్నారని ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version