ప్రగతికి ఇష్టమైన హీరోలు వారేనట..!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాలలో నటించిన ప్రగతి టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుతుంది. ఇక అంతేకాకుండా గతంలో ఎన్నో చిత్రాలలో హీరోయిన్గా కూడా నటించింది. అయితే అలా హీరోయిన్ గా కొనసాగిస్తున్న సమయంలో వివాహం చేసుకొని సినిమాలకు దూరంగా ఉన్నదట. అయితే ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ప్రగతి క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. ఇప్పుడున్న స్టార్ హీరోల సినిమాలలో మదర్ క్యారెక్టర్స్ చేస్తూ అద్భుతమైన నటన కనబరుస్తూ ఉన్నది. ఇటీవల ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రగతి తన వ్యక్తిగత జీవితం సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాటిని తెలియజేసింది వాటి గురించి తెలుసుకుందాం.

ప్రగతి మాట్లాడుతూ తనకు హీరో లంటే రజనీకాంత్, కమలహాసనే అంటూ తెలియజేసింది.కేవలం వారితో అయితేనే నేను హీరోయిన్ గా చేస్తానని అప్పట్లో చెప్పేదాన్ని అందువల్లే తనకు హీరోయిన్గా చాలా అవకాశాలు తక్కువగా వచ్చాయని తెలియజేసింది. ఇండస్ట్రీలో అందం అనేది ఒక ఫ్యాక్టర్ అయితే అవకాశాలకు కొదవేమి ఉండదని తెలియజేసింది. ఇక ప్రగతి కూడా తను అందగత్తెనే అంటూ చెప్పకనే చెప్పేసింది.

అయితే తాను ఏ విషయాన్ని అయినా సరే ముక్కుసూటిగా చెబుతానని తెలియజేసింది ప్రగతి. ముఖ్యంగా ఇన్స్టాగ్రాములో తను చేసే వర్కౌట్ వీడియోస్ ల గురించి మాట్లాడుతూ జిమ్ చేయడం వల్ల తన అందం ఏమి పెరగదని.. కేవలం స్ట్రెస్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందని తెలియజేసింది. అయితే ఈ వీడియోలు తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసినప్పుడు అభిమానులు ఎక్కువగా పాజిటివ్ గానే స్పందిస్తారని కేవలం కొంతమంది మాత్రమే నెగిటివ్గా స్పందిస్తారని తెలిపింది. ప్రస్తుతం ప్రగతి కి సంబంధించి ఈ వీడియో చాలా వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version