యూట్యూబ్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఉచితంగా ఒరిజిన‌ల్ షోస్ వీక్షించ‌వ‌చ్చు..!

-

ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్‌కు చెందిన యూట్యూబ్ త‌న యూజ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ను అందిస్తోంది. యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న ప‌లు ఒరిజిన‌ల్ షోలు, సిరీస్‌ల‌ను యూజ‌ర్లు ప్ర‌స్తుతం ఫ్రీగా చూడ‌వ‌చ్చు. అందుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన ప‌నిలేదు. ప్ర‌స్తుతం నెల‌కు రూ.129 చెల్లించే యూట్యూబ్ ప్రీమియం యూజ‌ర్ల‌కు మాత్ర‌మే స‌ద‌రు ఒరిజిన‌ల్ షోల‌ను వీక్షించే వీలు ఉంది. కానీ క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో స‌ద‌రు షోల‌ను ఉచితంగా వీక్షించే వీలు క‌ల్పిస్తున్న‌ట్లు యూట్యూబ్ తెలిపింది.

యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న ఒరిజిన‌ల్ షోస్ ఇవే…

* Escape the Night
* Matpat’s Game Lab
* Step Up: High Water
* Impulse
* Sherwood
* Sideswiped
* The Sidemen Show
* Foursome
* Me and My Grandma
* F2 Finding Football
* Overthinking with Kat & June
* The Fake Show

పైన తెలిపిన షోస్‌ను యూట్యూబ్‌లో వీక్ష‌కులు ఉచితంగా చూడ‌వ‌చ్చు. అయితే ఈ ఆఫ‌ర్ ఎప్ప‌టి వ‌ర‌కు అందుబాటులో ఉంటుందో.. ఆ వివ‌రాల‌ను యూట్యూబ్ వెల్ల‌డించ‌లేదు. కానీ ఏప్రిల్ 30వ తేదీ వ‌ర‌కు ఆ అవకాశం ఉంటుంద‌ని తెలిసింది. ఈ సంద‌ర్భంగా యూట్యూబ్ ఒరిజిన‌ల్ కంటెంట్ గ్లోబ‌ల్ హెడ్ సుసానె డానియెల్స్ మాట్లాడుతూ.. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఇండ్ల‌లోనే ఉండే యూజ‌ర్ల‌కు ఉచితంగా స‌ద‌రు షోస్‌ను వీక్షించేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు. ప్ర‌జ‌లు ఇండ్ల వ‌ద్దే సుర‌క్షితంగా ఉండాల‌ని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version