డ్రైవర్ నిద్ర పోతుండగా ఆర్టీసీ బస్సును చోరీ చేసిన దొంగ

-

డ్రైవర్ నిద్ర పోతుండగా ఆర్టీసీ బస్సును చోరీ చేసాడు దొంగ. నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపోకు చెందిన బస్సును చోరీ చేసాడు దొంగ. ఏఎస్ పేట నుంచి నెల్లూరు బస్టాండ్‌కు వచ్చింది బస్సు. ఇక ఆ బస్సును పార్క్ చేసి రెస్ట్ రూంలో నిద్రపోయాడు ఆర్టీసీ డ్రైవర్.. తెల్లారేసరికి ఆ బస్సు మాయం అయ్యింది.

Thief steals RTC bus while driver is sleeping
Thief steals RTC bus while driver is sleeping

సీసీ ఫుటేజ్ ఆధారంగా బుచ్చిరెడ్డిపాలెం టోల్‌గేట్ వద్ద బస్సును గుర్తించి.. దొంగను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బస్సును చోరీ చేసిన వ్యక్తి విడవలూరు మండలం కంచర్ల గ్రామానికి చెందిన బిట్రగుంట కృష్ణగా గుర్తించారు. ఇక డ్రైవర్ నిద్ర పోతుండగా ఆర్టీసీ బస్సును చోరీ చేసిన ఘటన వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news