దుబ్బాక ఉప ఎన్నిక.. దొంగ ఓటు కలకలం..?

దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దుబ్బాక లో భారీగా ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరారు. అయితే దుబ్బాక లోని పలు మండలాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలు ఈవీఎం ల లో సాంకేతిక సమస్యలు రావడంతో.. ఓటర్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇక పలు పోలింగ్ కేంద్రాలలో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు కూడా చూసుకున్నాయి.

రాయపోల్ మండలం కొత్తపల్లి లో ఒక వర్గానికి చెందిన కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తూ ఉంటే పోలీసులు కలుగజేసుకొని అందరినీ చెదరగొట్టారు. మెదక్ జిల్లా చేగుంట లో దొంగ ఓటు కలకలం సృష్టించింది. రాధాకృష్ణ శర్మ అనే వ్యక్తి ఓటు గుర్తు తెలియని వ్యక్తి వేసి వెళ్ళిపోయాడు. ఒక దొంగ ఓటు నమోదు కావడంతో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మాస్కు ధరించాలి అనే నిబంధన ఉండటంతో వచ్చిన వ్యక్తి ఎవరు అన్న విషయాన్ని గుర్తు పట్టలేదు అధికారులు.