”తిమ్మరుసు” ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన యంగ్‌ టైగర్‌

వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సత్యదేవ్. తాజాగా మరో కొత్త గెటప్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టాలెంటెడ్ యాక్టర్ నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తిమ్మరుసు అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా లాయర్‌ గా అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు యువ హీరో.

ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై ‘మను’ వంటి డిఫరెంట్ చిత్రాన్ని అందించిన నిర్మాత సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక అటు ఇప్పటికే.. ఈ సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది.

ఇవాళ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఈ సినిమా ట్రైలర్‌ ను రిలీజ్‌ చేసి… చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కోర్టు నేపథ్యంలో సాగే సన్నివేశాలతో ఆద్యంతం అలరిస్తుంది ఈ ట్రైలర్‌. లాయరు పాత్రలో సత్యదేవ్‌ చక్కగా ఆకట్టుకున్నాడు. ఇక సినిమాలో బ్రహ్మాజీ, రవిబాబు, అజయ్‌, ప్రవీణ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, వైవా హర్ష తదితరులు నటించారు. ఇక ఈ మూవీ జులై 30 న థియేటర్లలో రిలీజు కానుంది.