శాస్త్రం ప్రకారం పుట్టినరోజు ఏం చేయాలి తెలుసుకుందాం..

-

ప్రతి ఒక్కరికి పుట్టినరోజు అంటే ప్రత్యేకమైన అభిమానం. అదోక ప్రత్యేక అనుభూతిని అందించే రోజు. ఇటు లౌకికంగాగాని, ఆధ్యాత్మికంగా గానీ పరిశీలిస్తే తాను పుట్టి ఎన్నేండ్లు అయ్యింది. ఇప్పటి వరకు ఏం సాధించాను అనేది ఆలోచించుకునే రోజు. అంతేకాదు తాను ఇప్పటివరకు సాధించినది ఏమిటి? సాధించాల్సింది ఏమిటి అని పునరావలోకనం చేసుకునేరోజు. ఇవన్నీ పక్కకు పెడితే శాస్త్రం ప్రకారం పుట్టినరోజు ఏం చేయాలి తెలుసుకుందాం…

  • పుట్టినరోజునాడు మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ, నెయ్యి, పాలు తేనే, దర్భలు కలిపి తయారుచేసిన మిశ్రమంతో ఆహుతులు వేస్తూ హోమం చేయాలి. దీని వల్ల జీవితంలో ఎన్ని దుఃఖాలు, కష్టాలు,ఆపదలు ఉన్నా అవన్నీ శాంతిస్తాయి. మీ జీవితంలో గ్రహబాధలతో పీడితులై ఉన్నా వాటి ప్రభావాలన్నీ శాంతిస్తాయి.
  • మీ పుట్టినరోజున ప్రాతఃకాలమందే స్నానం, పూజా కార్యక్రమాలు, తల్లిదండ్రుల దీవెన, దేవాలయ దర్శనం, గోసేవ వంటి కార్యక్రమాలు చేసుకోవాలి.
  • పుట్టినరోజు మార్కండేయ, ఆంజనేయుడు, అశ్వత్థామ వంటి చిరంజీవులైన రుషులను స్మరించి ప్రార్థన చేసి ఒక పాత్రలో 93 గ్రామలు పాలు, కొన్ని నువ్వులు, బెల్లం కలిపి తాగినట్లయితే ఆ వ్యక్తి దీర్ఘాయుష్షును పొందుతాడు.
  • అశ్వత్థామ, రాజాబలి, వేదవ్యాస, హనుమంతా, విభీషణ, పరుశరామ, కృపాచార్య, మార్కండేయ అని పై మహాపురుషుల పేర్లను తలచుకుంటే చాలు. మీరు దీర్ఘాయుషులు అవుతారు.

ఇక ఆలస్యం ఎందుకు ప్రతి పుట్టిన రోజు ఏదో ఒక మంచి పని చేయండి, పై విధంగా పెద్దల,పుణ్యపురుషుల నామస్మరణతో పవిత్రంగా గడపండి.

Read more RELATED
Recommended to you

Latest news