పైన హెడ్డింగ్ చూడగానే ప్రేమించని వాళ్ళ జోలికి ఎందుకు వెళతాం అన్న మాట వస్తుంది. కానీ, మీరు బాగా ప్రేమించినవారు మిమ్మల్ని ప్రేమించకపోయినా కూడా ఆ ప్రేమ తగ్గదు. ఎన్నో రోజులుగా ప్రేమిస్తూ ఒకరోజు ప్రేమిస్తున్నానన్న మాట చెప్పగానే అవతలి వాళ్ళు నో అంటే ఆ బాధ వర్ణణాతీతం. నో అన్నాక కూడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటారు. ఏమో ఒప్పుకుంమో అన్న చిన్న ఆశతో. కానీ అవతలి వాళ్ళు ఒప్పుకోరు కదా మిమ్మల్ని అసహ్యించుకోవడం ప్రారంభిస్తారు. ఇటు మీరు ప్రేమిస్తూనే ఉంటారు. అటు వాళ్ళు అసహ్యించుకుంటూనే ఉంటారు.
నిజాయితీగా ఉండండి.
పూర్తిగా అవతలి వారి మీదనే ఆధారపడి బ్రతకట్లేదు. వారు మీ జీవితంలోకి రాకముందు మీరు బాగానే ఉన్నారు. ఇప్పుడు వారు మిమ్మల్ని ప్రేమించకపోయినా బాగానే ఉంటారు.
ఎవరితోనైనా మాట్లాడండి
ఈ ఫీలింగ్ గురించి ఎవరితోనైనా మాట్లాడండి. వారి జీవితంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగే ఉంటాయి. కాబట్టి మీకు కొద్దిగా ధైర్యం వస్తుంది. అవతలి వారు సంతోషంగా ఉంటున్నప్పుడు మీకేంటి?
నిందలు వద్దు
తప్పంతా నీదే అనో, తప్పంతా నాదే అనో నిందలు వేయడం మానుకోండి. దానివల్ల ఒరిగేదేమీ లేదు. మిమ్మల్ని తిట్టుకుంటే మీ నమ్మకం తగ్గుతుంది. అవతలి వారిని తిడితే మీపై అసహ్యం ఇంకా పెరుగుతుంది.
ఏడవడం
కొన్నిసార్లు ఏడుపు కూడా చాలా మేలు చేస్తుంది. మీలో ఉన్న బాధంతా కంటినీటి ద్వారా బయటకి పంపేయండి. గుండె తేలికవుతుంది.
అన్ని దారాలు కత్తిరించండి.
మిమ్మల్ని ప్రేమించని వారితో కొన్ని రోజుల పాటు అన్ని విషయాల్లో దూరంగా ఉండండి. స్నేహంగా ఉందాం అని అవతలి వాళ్ళు పిలిచినా కూడా దూరంగా ఉండడమే మేలు.
దారి మళ్ళించండి
మీరు ప్రేమించిన వారికి దూరంగా ఉండండి. లాంగ్ ట్రిప్ ఏదైనా ప్లాన్ చేయండి. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ కొత్త విషయాలు నేర్చుకుంటే బాగుంటుంది.
మీపై శ్రద్ధ వహించండి
కొన్నిసార్లు మర్చిపోయినా కూడా లోపల బాధ ఉంటూనే ఉంటుంది. మీ ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి.