అనేక ఊహాగానాల మధ్య బీహార్ సీఎంగా మళ్లీ నితీష్ కుమార్ ఎంపికయ్యారు ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా నితీష్ కుమార్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. దీంతో రేపు నాలుగో సారి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో బీహార్ శాసనసభాపక్ష నేతగా నితీష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మొత్తం నూట పాతిక సీట్లను గెలుచుకుంది. ఇందులో బిజెపి డెబ్బై నాలుగు సీట్లు గెలుచుకోగా జేడీయూ 43 సీట్లు గెలుచుకుంది. ఇక డిప్యూటీ సీఎంగా మరోసారి సుశీల మోడీకి అవకాశం లభించింది. బీహార్‌లో ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలైన బిజెపి , జనతాదళ్ యునైటెడ్ – జేడీయూ , హిందుస్థానీ అవామీ మోర్చా సెక్యులర్ – హం, వికాశ్ శీల్ ఇన్సాన్ పార్టీ-వీఐపీ నేతలు భేటీ అయ్యి ఈ నిర్ణయం తీసుకున్నారు.