భారీ వ‌ర్షాలు : తిరుమ‌ల ఘాట్ రోడ్లు బంద్

-

ఆంధ్ర ప్ర‌దేశ్ లో కురుస్తున్న భారీ వ‌ర్షాలు ఇంకా తగ్గుముఖం ప‌ట్ట‌లేదు. ముఖ్యం గా చిత్తూర్, క‌డ‌ప‌, నెల్లూర్ జిల్లాలో అతి భారీ వ‌ర్షాలు ప‌డుతున్నాయి. అలాగే తిరుప‌తి న‌గ‌రంలో గ‌తం లో ఎప్పుడు కుర‌వ‌ని వ‌ర్షాలు ప్ర‌స్తుతం ప‌డుతున్నాయని స్థానికులు , అధికారులు తెలుపుతున్నారు. అయితే తిరుమ‌ల‌లో భారీ వ‌ర్షాలు ప‌డ‌టం తో కొండ చ‌రియ‌లు విరిగి ప‌డుతున్నాయి. దీంతో టీటీడీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నేటి నుంచి తిరుమ‌ల ఘాట్ రోడ్ల‌ను అన్నింటిని కూడా మూసివేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు.

తాము మ‌ళ్లి ప్ర‌క‌టించే వర‌కు ఘాట్ రోడ్లు మూసి వేసి ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది. అయితే భారీ వ‌ర్షాలు ప‌డ‌టం వ‌ల్ల కొండ చ‌రియ‌లు విరిగి ప‌డి ఘాట్ రోడ్ల పై బండ రాళ్లు ప‌డుతున్నాయి. అందు వ‌ల్లే ఘాట్ రోడ్ల‌ను మూసి వేశామ‌ని టీటీడీ ప్ర‌తినిధులు తెలిపారు. అయితే తిరుమ‌ల లో కురుస్తున్న భారీ వ‌ర్షాల వ‌ల్ల స్థానికులు, భ‌క్తులు తీవ్రంగా ఇబ్బందులు ప‌డుతున్నారు. అంతే కాకుండా తిరుమ‌ల లో ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని కూడా చిత్తూర్ జిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌జ‌ల‌కు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version