న‌టి చౌరాసియా కేసును ఛేదించిన పోలీసులు

-

కేబీఆర్ పార్క్ లో న‌టి షాలు చౌరాసియా పై దాడి చేసి.. సెల్ ఫోన్ ను దొంగ‌లించిన ఘ‌ట‌న తెలిసిందే. అయితే ఈ కేసు ను బంజారాహిల్స్ పోలీసులు ఛేదించారు. న‌టి షాలు చౌరాసియా పై దాడి చేసిన నిందితున్ని ఈ రోజు పోలీసులు అరెస్టు చేశారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కెబిఆర్ పార్క్ లో ఈనెల 14వ తేదీ సినీ నటి షాలు చౌరాసియా పై ఒక వ్య‌క్తి దాడి చేశాడు. అంతే కాకుండా అమె మొబైల్ ఫోన్ ను చోరీ చేశాడు.

అయితే అదే రోజు బంజారా హిల్స్ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దాదాపు వారం రోజుల పాటు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, బంజారా హిల్స్ పోలీసులు క‌లిసి ద‌ర్యాప్తు చేశారు. అయితే ఈ కేసును పోలీసులు ఛాలెంజ్ గా తీసుకుని వేగం గా ద‌ర్యాప్తు చేశారు. ఈ కేసు ద‌ర్యాప్తు కు పోలీసులు మొత్తం 8 బృందాలుగా విడిపోయి కేసు ను దర్యాప్తు చేశారు. చివ‌ర‌గా ఈ రోజు కేసు ను ఛేదించారు. ఆ నిందితున్ని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version