30 సెక‌న్ల‌లోనే క‌రోనాను అంతం చేసే స‌రికొత్త డివైస్‌..!

-

క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కొనేందుకు గాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక దేశాలు పోరాటం చేస్తున్నాయి. వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా ప్ర‌జ‌లు ఓ వైపు మాస్కుల‌ను ధ‌రిస్తూ బ‌హిరంగ ప్ర‌దేశాల్లో సామాజిక దూరం పాటిస్తున్నారు. ఇక ఆయా వ‌స్తువుల‌పై, ఉప‌రిత‌లాల‌పై క‌రోనా వైర‌స్ ఉండ‌కుండా నాశ‌నం చేసేందుకు గాను ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త వ‌స్తువుల‌ను త‌యారు చేసి విడుద‌ల చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే తాజాగా మాస‌ర్ టెక్నాల‌జీ అనే సంస్థ ఓ సరికొత్త డివైస్‌ను ఆవిష్క‌రించింది. దాని పేరు అతుల్యా స్టెరిలైజర్‌.

అతుల్యా స్టెరిలైజ‌ర్‌ను డీఆర్‌డీవోకు చెందిన మైక్రోవేవ్‌ సాంకేతిక ప‌రిజ్ఞానంతో త‌యారు చేశారు. మాస‌ర్ టెక్నాలజీ ఈ డివైస్‌ను రూపొందించింది. ఇది కేవ‌లం 30 సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే ఉప‌రితలాలు, వ‌స్తువుల‌ను శానిటైజ్ చేస్తుంది. క‌రోనాను పూర్తిగా అంతం చేస్తుంది. కాగా ఈ డివైస్‌ను కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ఆవిష్క‌రించారు. ఈ డివైస్ నుంచి వెలువ‌డే మైక్రోవేవ్ త‌రంగాలు ఉప‌రితలాల నుంచి 5 మీట‌ర్ల లోప‌ల‌కి చొచ్చుకు వెళ్ల‌గ‌ల‌వు. అందువ‌ల్ల వైర‌స్, ఇత‌ర బాక్టీరియాలు అస‌లు బ‌తికి ఉండే అవ‌కాశ‌మే లేదు. కేవ‌లం 30 సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే ఉప‌రితలాలు, వ‌స్తువులపై ఉండే క్రిములు పూర్తిగా నశిస్తాయి.

ఈ డివైస్ మ‌నుషుల‌కు పూర్తిగా సేఫ్ అని మాస‌ర్ టెక్నాల‌జీ తెలిపింది. అందుకు ప‌లు ర‌కాల ప‌రీక్ష‌లు కూడా చేశామ‌ని ఆ సంస్థ ప్ర‌తినిధులు తెలిపారు. అందువ‌ల్ల ఈ డివైస్ తో మ‌నుషుల‌కు పూర్తిగా సేఫ్టీ ఉంటుంద‌న్నారు. దీన్ని సుర‌క్షితంగా వాడ‌వ‌చ్చ‌న్నారు.

కాగా అతుల్యా స్టెరిలైజ‌ర్ డివైస్ ధ‌ర‌ను రూ.12,700 గా నిర్ణ‌యించారు. దీన్ని ప్ర‌భుత్వ ఈ-మార్కెట్ పోర్ట‌ల్ https://gem.gov.in/ లేదా అమెజాన్ సైట్‌లో కొన‌వ‌చ్చు. ఈ డివైస్ 220 వోల్టుల విద్యుత్ ఆధారంగా ప‌నిచేస్తుంది. అంటే ఇంట్లో టీవీ, ఫ్యాన్ మాదిరిగా క‌రెంటును తీసుకుంటుంద‌న్న‌మాట‌. 800 వాట్ల సామ‌ర్థ్యంతో ప‌నిచేస్తుంది. దీని బ‌రువు సుమారుగా 7.7 కిలోలు. అమెజాన్‌లో ఆర్డ‌ర్ చేస్తే 7 నుంచి 10 రోజుల్లోగా ఈ డివైస్‌ను డెలివ‌రీ పొంద‌వ‌చ్చు. ఉప‌రిత‌లాలు, వ‌స్తువుల‌ను కోవిడ్ లేకుండా శానిటైజ్ చేసేందుకు, ఆఫీసుల్లో, ప‌రిశ్ర‌మ‌ల్లో ఈ డివైస్‌ను వాడ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version