ఆన్లైన్ లో చెక్ పేమెంట్స్ ని ఆపాలంటే ఇలా ఈజీగా చేసేయచ్చు..!

-

ఈ మధ్య కాలం లో చాలా మంది ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యాలను ఉపయోగిస్తున్నారు. దీనితో చిటికెలో బ్యాంక్ పనులను పూర్తి చేసుకో వచ్చు. బ్యాంకుకి వెళ్లకుండానే ఈజీగా పనులు అవుతాయి. మీ మొబైల్ నెంబర్ బ్యాంకు వద్ద తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి అప్పుడే కుదురుతుంది.

 

ఇది ఇలా ఉంటే ఒక్కోసారి పలు కారణాల చేత చెక్‌లను క్యాన్సిల్ చేస్తూ ఉంటాం. చెక్ పేమెంట్స్ ని ఒక్కోసారి మనం వెంటనే క్యాన్సల్ చేస్తాం. అయితే ఎలా క్యాన్సల్ చెయ్యాలి అనేది ఇప్పుడు చూద్దాం. మరి దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

క్యాన్సల్ చేయాలంటే ముందు ఎస్‌బీఐ బ్యాంకు వెబ్‌సైట్ ‘onlinesbi.com‘కి వెళ్లాలి.
నెక్స్ట్ మీరు నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అయ్యి
ఆ తరవాత క్యాప్చాను, ఓటీపీని ఎంటర్ చెయ్యండి.
మీరు నెక్స్ట్ హెమ్ పేజీలో ఉన్న ‘Request & Enquiries’ క్లిక్ చేయాలి
ఆ తరవాత ‘Stop Payment’ ట్యాబ్‌పై క్లిక్ చెయ్యండి.
స్టార్ట్ చెక్ నెంబర్, ఎండ్ చెక్ నెంబర్ వివరాలను ఎంటర్ చేయాలి.
చెక్ టైప్‌ను సెలెక్ట్ చేసాక డ్రాప్ డౌన్ మెనూలో రీజన్ రాయాలి.
టర్మ్స్ అండ్ కండీషన్ల ఐకాన్‌ను టిక్ చేసి సబ్మిట్ చెయ్యాలి అంతే.

Read more RELATED
Recommended to you

Latest news