వెన్ను నొప్పికి చక్కని పరిష్కారం ఇదే..!?

-

ఉరుకుల పరుగుల జీవితంలో చాల మందికి విశాంత్రి తీసుకోవడానికి కూడా టైం దొరకడం లేదు. ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు ఎదోఒక్క పని చేస్తూనే ఉంటారు. అయితే గంటల తరబడి కూర్చోవడం వలన వెన్నునొప్పి రావడం ఖాయం. అలా వెన్నునొప్పి కలిగినప్పుడు కొన్ని ఇంటి చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు. అవి ఏంటో చూద్దామా..!

back pain

ఇక ఆముదం, నూనెలు సౌందర్య పోషణలో కీలకపాత్రను పోషిస్తాయి. ఆముదాన్ని వేడి చేసి వెన్నునొప్పి ఉన్నచోట మృదువుగా రాసి మసాజ్ చేయాలి. ఇలా చేస్తుండడం వల్ల నొప్పి చాలా వరకూ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు వెల్లుల్లిపాయలను నువ్వుల నూనెలో వేసి బాగా మరిగించాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే రాసుకోవడం వల్ల సమస్య తీవ్రత తగ్గుతుంది. అంతేకాక పాలు, మునగాకు రసం, సమపాళ్లలో తీసుకుని తాగడం వలన వెన్నునొప్పితగ్గుతుంది.

ఇవే కాకుండా అధిక బరువు ఉంటే తగ్గేందుకు ప్రయత్నం చేయాలి. కేవలం చిట్కాలు పాటించడం మందులు వాడడమే కాదు, సాధ్యమైనంత వరకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అప్పుడే వెన్నునొప్పి నుంచి పూర్తి ఉపశమనం కలుగుతుంది. అయితే వెన్ను నొప్పి రాకుండా వుండాలంటే.. కారు, బైక్ నడిపే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. కారు నడిపేటప్పుడు చిన్నపాటి దిండ్లను ఉపయోగించడం మంచిది. వెన్ను నొప్పి ఎక్కువగా ఉన్న సమయంలో అధిక బరువులు ఎత్తడం, హఠాత్తుగా వంగటం వంటివి అస్సలు చేయకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే వెన్ను నొప్పిని తేలికగా తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలియచేస్తున్నారు.

అంతేకాదు వెన్నునొప్పి చాల వరకూ మనం తీసుకునే జాగ్రత్తలతో తగ్గుతుంది. ఒకవేళ విశ్రాంతి తీసుకున్నా నొప్పి అలానే ఉంటేఆలస్యం చేయకుండా డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. అలాగే వెన్ను నుంచి ఈ నొప్పి కాళ్లు, మోకాళ్ల కింద కూడావస్తున్నా నీరసంగా అయిపోతున్నా, బద్దకంగా ఉన్నకాళ్లలో తిమ్మిరిలా ఉన్న అస్సలు అశ్రద్ధ చేయకుండా డాక్టర్‌ను కలవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version