డోనాల్డ్ ట్రంప్ చిన్ననాటి గృహం మరోసారి వేలానికి వచ్చింది. 22 కోట్ల విలువైన న్యూయార్క్ లోని హౌస్ 2016 తర్వాత మళ్ళీ మార్కెట్ లో పెట్టారు. దాన్ని అభిమానులు క్రౌడ్ ఫండింగ్ చేసి కొంటే, ట్రంప్ నకు గిఫ్ట్ గా ఇస్తామని రియల్ ఎస్టేట్ ఏజెన్సీ పారామౌంట్ రియాలిటీ తెలిపింది. దాని ధర 22 కోట్లుగా వెల్లడించింది. గతంలో ఇంటిని అమ్మడానికి ప్రయత్నించి ఈ సంస్థ విఫలమైంది. నాలుగేళ్ల వయసు వరకు ట్రంప్ ఇంట్లోనే ఉన్నారు.